Telugu Global
Cinema & Entertainment

బయ్యర్లకు చుక్కలుచూపిస్తున్న బాహుబలి

బాహుబలి-2 సినిమాకు సంబంధించి ప్రీ-బిజినెస్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఊసెత్తితేనే బయ్యర్లు హడలిపోతున్నారు. అంతలా చుక్కలుచూపిస్తున్నారట నిర్మాతలు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ హక్కుల విషయంలో నిర్మాతలు చెబుతున్న ఫిగర్స్ కు బయ్యర్ల గుండెజారి గల్లంతవుతోందట. అవును… ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలు చెల్లించాలని బాహుబలి నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటివరకు ఓవర్సీస్ రైట్స్… అత్యధిక రేటుకు అమ్ముడుపోయింది బాహుబలి సినిమాతోనే. ఆ సినిమా తొలి భాగాన్ని 9కోట్ల రూపాయలకు అమ్మారు. […]

బయ్యర్లకు చుక్కలుచూపిస్తున్న బాహుబలి
X
బాహుబలి-2 సినిమాకు సంబంధించి ప్రీ-బిజినెస్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఊసెత్తితేనే బయ్యర్లు హడలిపోతున్నారు. అంతలా చుక్కలుచూపిస్తున్నారట నిర్మాతలు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ హక్కుల విషయంలో నిర్మాతలు చెబుతున్న ఫిగర్స్ కు బయ్యర్ల గుండెజారి గల్లంతవుతోందట. అవును… ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలు చెల్లించాలని బాహుబలి నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటివరకు ఓవర్సీస్ రైట్స్… అత్యధిక రేటుకు అమ్ముడుపోయింది బాహుబలి సినిమాతోనే. ఆ సినిమా తొలి భాగాన్ని 9కోట్ల రూపాయలకు అమ్మారు. సినిమా అక్కడ 70లక్షల డాలర్లు వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో అటుఇటుగా 42 కోట్ల రూపాయల వసూళ్లన్నమాట. ఈ ఫిగర్ చూసిన నిర్మాతలు… ఇప్పుడు బాహుబలి-2కు ఏకంగా 35 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇంతపెట్టి సినిమా కొంటే కనీసం రిజల్ట్ ఎలా ఉంటుందా అని బయ్యర్లు భయపడుతున్నారు. ఎందుకంటే తెలుగులో సీక్వెల్ లేదా రెండో భాగాలకు ఆదరణ దక్కిన సందర్భాలు చాలా అరుదు. ఓవరాల్ గా అమెరికా హక్కులతో పాటు మొత్తం ఓవర్సీస్ రైట్స్ ను 50కోట్లకు అమ్మాలనేది బాహుబలి నిర్మాతల ప్లాన్.
First Published:  13 Feb 2016 1:34 AM GMT
Next Story