Telugu Global
Cinema & Entertainment

మాస్ రాజాకు క్లాస్ సంగీతం

మాస్ మహారాజ్ సినిమాలకు ఎలాంటి ట్యూన్స్ ఇవ్వాలో తమన్ కు తెలిసినట్టు మరెవరికీ తెలీదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు దాదాపు అరడజను సినిమాలొచ్చాయి. తన నెక్ట్స్ సినిమాలకు కూడా తమన్ నే రిపీట్ చేస్తానని రవితేజ చాలాసార్లు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం రవితేజ-తమన్ మధ్య ఏం జరిగిందో అర్థం కావట్లేదు. తమన్ ను కొద్ది రోజులుగా రవితేజ దూరం పెట్టాడు. తాజా చిత్రం బెంగాల్ టైగర్ కు కూడా తమన్ సంగీతం అందించలేదు. పోనీలే ఒక […]

మాస్ రాజాకు క్లాస్ సంగీతం
X
మాస్ మహారాజ్ సినిమాలకు ఎలాంటి ట్యూన్స్ ఇవ్వాలో తమన్ కు తెలిసినట్టు మరెవరికీ తెలీదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు దాదాపు అరడజను సినిమాలొచ్చాయి. తన నెక్ట్స్ సినిమాలకు కూడా తమన్ నే రిపీట్ చేస్తానని రవితేజ చాలాసార్లు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం రవితేజ-తమన్ మధ్య ఏం జరిగిందో అర్థం కావట్లేదు. తమన్ ను కొద్ది రోజులుగా రవితేజ దూరం పెట్టాడు. తాజా చిత్రం బెంగాల్ టైగర్ కు కూడా తమన్ సంగీతం అందించలేదు. పోనీలే ఒక సినిమానే కదా… మళ్లీ ఛాన్స్ ఇస్తాడనుకున్నారంతా. కానీ తన నెక్ట్స్ సినిమాకు కూడా తమన్ ను పక్కనపెట్టాడు రవితేజ.
చక్రి అనే కొత్త దర్శకుడితో చేయబోతున్న సినిమాకు క్లాస్ మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ ను తీసుకున్నాడు. దీంతో రవితేజ-తమన్ ఫ్రెండ్ షిప్ బాండ్ కు బీటలు పడిందంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగా రవితేజ-తమన్ కు మధ్య సంబంధాలు చెడిపోయాయా…? వాళ్లిద్దరి మధ్య అంతగా సంబంధాలు దెబ్బతినడానికి కారణాలు ఏమై ఉంటాయి…? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.
First Published:  11 Feb 2016 8:28 PM GMT
Next Story