Telugu Global
WOMEN

ప్ర‌తి ఇంట్లో ఉన్న‌దే...అయినా నవ్వొస్తుంది!

సాధార‌ణంగా అప్పుడప్పుడే న‌డ‌క వ‌స్తున్న పిల్ల‌ల త‌ల్లుల‌కు ఒళ్లు రాదు. ఎందుకంటే పిల్ల‌ల ప‌నుల‌తోనే ఆమెకు స‌రిప‌డా వ్యాయామం దొరుకుతుంది కాబ‌ట్టి. కెన‌డాకి చెందిన ఒక మ‌హిళ త‌న చిన్నారుల‌కు బ‌ట్టలు వేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం చూస్తే అందులో ఎంత నిజ‌ముందో అర్ధ‌మ‌వుతుంది.  ముగ్గురు క‌వ‌ల‌లు, ఒక రెండేళ్ల బాబు న‌లుగురికీ క‌లిపి ఒకేసారి దుస్తులు వేయ‌డానికి ఆ మ‌హిళ ప‌డిన పాట్ల‌ను రెండునిముషాల వీడియోగా పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నాలుగురోజుల్లో దాదాపు నాలుగు […]

ప్ర‌తి ఇంట్లో ఉన్న‌దే...అయినా నవ్వొస్తుంది!
X

సాధార‌ణంగా అప్పుడప్పుడే న‌డ‌క వ‌స్తున్న పిల్ల‌ల త‌ల్లుల‌కు ఒళ్లు రాదు. ఎందుకంటే పిల్ల‌ల ప‌నుల‌తోనే ఆమెకు స‌రిప‌డా వ్యాయామం దొరుకుతుంది కాబ‌ట్టి. కెన‌డాకి చెందిన ఒక మ‌హిళ త‌న చిన్నారుల‌కు బ‌ట్టలు వేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం చూస్తే అందులో ఎంత నిజ‌ముందో అర్ధ‌మ‌వుతుంది. ముగ్గురు క‌వ‌ల‌లు, ఒక రెండేళ్ల బాబు న‌లుగురికీ క‌లిపి ఒకేసారి దుస్తులు వేయ‌డానికి ఆ మ‌హిళ ప‌డిన పాట్ల‌ను రెండునిముషాల వీడియోగా పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నాలుగురోజుల్లో దాదాపు నాలుగు కోట్ల‌మంది దీన్ని చూశారు. కారీ అనే ఆ మ‌హిళ ఈ ఫీట్ చేస్తుండ‌గా ఆమె భ‌ర్త డాన్ గిబ్స‌న్ షూట్ చేశాడు. సాధార‌ణంగా ఇద్ద‌రూ క‌లిసి పిల్ల‌ల‌కు బ‌ట్టలు వేస్తారు. త‌ల్లి ఒక్క‌తే ఈ ప‌ని చేసిన‌పుడు చిన్నారులు పెట్టిన ముప్పుతిప్ప‌లు మ‌న‌ల్ని క‌డుపుబ్బా న‌వ్వించేలా ఉన్నాయి. ఇదే ఛాలెంజ్‌ని తండ్రి తీసుకున్న‌పుడు తీసిన వీడియో దీనికి సీక్వెల్‌గా వ‌స్తుంద‌ని ఒక స్థానిక వెబ్‌సైట్ తెలిపింది.

https://youtu.be/sKy3rYGaRTA

First Published:  11 Feb 2016 7:22 AM GMT
Next Story