Telugu Global
Health & Life Style

ఆ ప‌క్క‌కి తిరిగితే మేలు!

రాత్రిళ్లు ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం ఆ త‌రువాత గుండెల్లో మంట‌, అరుగుద‌ల స‌మ‌స్య‌లు లాంటివి భ‌రించ‌డం ఇప్పుడు చాలా ఇళ్ల‌లో సాధార‌ణ విష‌యాలే. ఇలాంట‌పుడు నిద్ర‌పోయే స‌మ‌యంలో కొన్ని సూచ‌న‌లు పాటించ‌మంటున్నారు వైద్యులు. ఇలాంటివారు ఒక‌టికి బ‌దులుగా రెండు దిండ్ల‌ను త‌ల‌కింద ఉంచుకోవాల‌ట‌. క‌నీసం త‌ల‌ని 11 అంగుళాల ఎత్తున ఉండేలా చూసుకుంటే మంచిద‌ట‌. ఇలా పెట్టుకుంటే మంత్రం వేసిన‌ట్టుగా గుండెల్లో మంట త‌గ్గుతుంద‌ని వారు చెబుతున్నారు. అలాగే కుడివైపున కాకుండా ఎడ‌మ‌వైపుకి తిరిగి ప‌డుకుంటే కూడా […]

ఆ ప‌క్క‌కి తిరిగితే మేలు!
X

రాత్రిళ్లు ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం ఆ త‌రువాత గుండెల్లో మంట‌, అరుగుద‌ల స‌మ‌స్య‌లు లాంటివి భ‌రించ‌డం ఇప్పుడు చాలా ఇళ్ల‌లో సాధార‌ణ విష‌యాలే. ఇలాంట‌పుడు నిద్ర‌పోయే స‌మ‌యంలో కొన్ని సూచ‌న‌లు పాటించ‌మంటున్నారు వైద్యులు. ఇలాంటివారు ఒక‌టికి బ‌దులుగా రెండు దిండ్ల‌ను త‌ల‌కింద ఉంచుకోవాల‌ట‌. క‌నీసం త‌ల‌ని 11 అంగుళాల ఎత్తున ఉండేలా చూసుకుంటే మంచిద‌ట‌. ఇలా పెట్టుకుంటే మంత్రం వేసిన‌ట్టుగా గుండెల్లో మంట త‌గ్గుతుంద‌ని వారు చెబుతున్నారు. అలాగే కుడివైపున కాకుండా ఎడ‌మ‌వైపుకి తిరిగి ప‌డుకుంటే కూడా ఈ స‌మ‌స్య స‌గం వ‌ర‌కు త‌గ్గుతుంద‌ట‌.

ఆరుసార్లు అలా ఆలా…

ప్ర‌శాంతంగా క‌ళ్లు మూసుకుని ముప్పయి సెక‌న్ల‌లో ఆరుసార్లు నిదానంగా ఊపిరి పీల్చి వ‌దిలితే పెరిగిన ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంద‌ట‌. జ‌పాన్లో నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నంలో ఈ విష‌యాన్నిప‌రిశీలించి చూశారు. బాగా శ్ర‌మ‌ప‌డిన‌ప్పుడు, అప్పుడ‌ప్పుడు బిపి పెరుగుతున్నా, అలాంటివారికి కూడా స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.

మెద‌డుకి మేలు

వారానికి ఒక్క‌సార‌యినా కాస్త శ‌రీరాన్ని శ్ర‌మ‌పెట్టే వ్యాయామాలు చేస్తే మెద‌డు శ‌క్తి పెరిగి ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ని ఒక కెన‌డా అధ్య‌య‌నంలో తేలింది. అయితే అందుకోసం జిమ్‌కి వెళ్లి క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని మ‌న శ‌రీర బ‌రువుని మ‌న‌మే మోసే అవ‌కాశం ఉన్న పుష‌ప్స్ కానీ, క్రంచెస్ (వెల్ల‌కిలా ప‌డుకుని కాళ్లు చేతులు ఎత్తుతూ చేసే వ్యాయామాలు) గానీ చేయ‌మ‌ని వీరు స‌ల‌హా ఇస్తున్నారు.

First Published:  11 Feb 2016 4:18 AM GMT
Next Story