Telugu Global
Cinema & Entertainment

అంత‌మంది ఉండ‌ట‌మే అస‌లు స‌మ‌స్య‌!

మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల సినిమా బ్ర‌హ్మోత్సవంలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు క‌లిసి చాలామంది ప్ర‌ముఖ న‌టీనటులు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మ‌హేష్‌కి హీరోయిన్లుగా కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత న‌టిస్తుండ‌గా ఇంకా ఈ సినిమాలో  జ‌య‌సుధ‌, రేవ‌తి, రావు ర‌మేష్, స‌త్య‌రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంత‌మంది తెర‌మీద క‌న‌బ‌డితే ప్రేక్ష‌కుడికి ఆనంద‌మే కానీ నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు మాత్రం చిక్కులు ఎదురవుతున్నాయి. వీరంద‌రినీ క‌ల‌ప‌డంలో డేట్ల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.  అంద‌రూ బిజీగా ఉండ‌టం వ‌ల‌న క‌లిసి న‌టించాల్సిన సీన్ల‌కు డేట్లు అడ్జెస్ట్ […]

అంత‌మంది ఉండ‌ట‌మే అస‌లు స‌మ‌స్య‌!
X

మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల సినిమా బ్ర‌హ్మోత్సవంలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు క‌లిసి చాలామంది ప్ర‌ముఖ న‌టీనటులు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మ‌హేష్‌కి హీరోయిన్లుగా కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత న‌టిస్తుండ‌గా ఇంకా ఈ సినిమాలో జ‌య‌సుధ‌, రేవ‌తి, రావు ర‌మేష్, స‌త్య‌రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంత‌మంది తెర‌మీద క‌న‌బ‌డితే ప్రేక్ష‌కుడికి ఆనంద‌మే కానీ నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు మాత్రం చిక్కులు ఎదురవుతున్నాయి.

వీరంద‌రినీ క‌ల‌ప‌డంలో డేట్ల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అంద‌రూ బిజీగా ఉండ‌టం వ‌ల‌న క‌లిసి న‌టించాల్సిన సీన్ల‌కు డేట్లు అడ్జెస్ట్ కాక షూటింగ్ ఆల‌స్యం అవుతున్న‌ట్టు స‌మాచారం. అందుకే ముందే ప్లాన్ చేసిన‌ట్టుగా ఈ సినిమాని ఏప్రిల్ 29న కాకుండా, మే 20న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న ఆడియోని లాంచ్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అయితే అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ముందు అనుకున్న తేదీనే చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని, ఒక‌వేళ ఆల‌స్యం అయితే విడుద‌లను వాయిదా వేస్తామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

First Published:  10 Feb 2016 11:24 PM GMT
Next Story