Telugu Global
Cinema & Entertainment

హిట్ కాంబినేషన్ మరోసారి...

అవును… ముచ్చటగా మూడోసారి కలవబోతున్నారు బన్నీ-త్రివిక్రమ్. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇప్పుడు మూడోసారి కలిసి హ్యాట్రిక్ కొట్టేద్దామని ఫిక్స్ అయింది ఈ హిట్ కాంబినేషన్. అయితే  అంతా బాగానే ఉంది కానీ… ఇంత సడెన్ గా.. ఎవరూ ఊహించని విధంగా వీళ్లిద్దరు కలవడమేంటనేదే తాజా ప్రశ్న. ప్రస్తుతం నితిన్ తో అ..ఆ అనే సినిమా చేస్తున్న త్రివిక్రమ్… అది పూర్తయిన వెంటనే సూర్యతో ఓ […]

హిట్ కాంబినేషన్ మరోసారి...
X
అవును… ముచ్చటగా మూడోసారి కలవబోతున్నారు బన్నీ-త్రివిక్రమ్. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇప్పుడు మూడోసారి కలిసి హ్యాట్రిక్ కొట్టేద్దామని ఫిక్స్ అయింది ఈ హిట్ కాంబినేషన్. అయితే అంతా బాగానే ఉంది కానీ… ఇంత సడెన్ గా.. ఎవరూ ఊహించని విధంగా వీళ్లిద్దరు కలవడమేంటనేదే తాజా ప్రశ్న. ప్రస్తుతం నితిన్ తో అ..ఆ అనే సినిమా చేస్తున్న త్రివిక్రమ్… అది పూర్తయిన వెంటనే సూర్యతో ఓ సినిమాకు కమిటయ్యాడు. మరోవైపు బన్నీ కూడా సరైనోడు సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీకి రెడీ అవుతున్నాడు. మరి త్రివిక్రమ్-బన్నీ కాంబో ఎలా సెట్ అవుతుంది. కానీ అలా సెట్ అయిపోయిందంతే….
బన్నీ సినిమాకు స్క్రీన్ ప్లేకు మరింత సమయం కావాలని కోరాడట విక్రమ్ కుమార్. అటు సూర్య కూడా త్రివిక్రమ్ కంటే ముందే మరో సినిమాకు కమిటయ్యాడట. సో… అటు నితిన్ సినిమా తర్వాత త్రివిక్రమ్… బోయపాటి సినిమా తర్వాత బన్నీ ఇద్దరూ ఖాళీ అన్నమాట. అలా హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అయిపోయింది.
First Published:  10 Feb 2016 1:40 AM GMT
Next Story