Telugu Global
Cinema & Entertainment

క‌త్రీనా ఆవిధంగా ఆశ ప‌డుతుంది..!

ఎక్క‌డో బ్రిటిన్ లో పుట్టి… ఇండియా కి వ‌చ్చి త‌న స్వ‌యం కృషి తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన న‌టి క‌త్రీనా కైఫ్. కెరీర్ ప్రారంభంలో అస‌లు హీరోయిన్ గా ప‌నికిరాద‌నే విమ‌ర్శ‌లు ఫేస్ చేసింది. డాన్స్ విష‌యంలో వేస్ట్ అన్నారు. ముడి బంగారం కొలిమిలో వేడి చేసి ఆభ‌రణం చేయ‌డానికి సుత్తి తో దెబ్బలు తిన్నట్లు …అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ.. త‌న‌ను తాను న‌టిగా ప్రూవ్ చేసుకుంది. అగ్ర ప‌ధానికి దూసుకెళ్లింది. బాలీవుడ్ లో […]

క‌త్రీనా ఆవిధంగా ఆశ ప‌డుతుంది..!
X

ఎక్క‌డో బ్రిటిన్ లో పుట్టి… ఇండియా కి వ‌చ్చి త‌న స్వ‌యం కృషి తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన న‌టి క‌త్రీనా కైఫ్. కెరీర్ ప్రారంభంలో అస‌లు హీరోయిన్ గా ప‌నికిరాద‌నే విమ‌ర్శ‌లు ఫేస్ చేసింది. డాన్స్ విష‌యంలో వేస్ట్ అన్నారు. ముడి బంగారం కొలిమిలో వేడి చేసి ఆభ‌రణం చేయ‌డానికి సుత్తి తో దెబ్బలు తిన్నట్లు …అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ.. త‌న‌ను తాను న‌టిగా ప్రూవ్ చేసుకుంది. అగ్ర ప‌ధానికి దూసుకెళ్లింది. బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ లేకుండా త‌నను తాను ప్రూవ్ చేసుకోవ‌డం అంటే చాల గొప్ప‌.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు న‌టిగా కొంత ట‌ఫ్ టైమ్ ఫేస్ చేస్తుంది. పూర్తిగా గ్లామ‌ర్ రోల్స్ చేసే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే..ఆ ప్లేస్ ను దీపిక ప‌దుకోణ్, అలియ భ‌ట్, వాణి కూప‌ర్, ఇలా త‌న‌కంటే చిన్న వ‌య‌సు హీరోయిన్స్ తో చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆసక్తి చూపుతున్నారు.ఇక‌ స్టార్ హీరోల ఛాయ‌స్ కూడా కొత్త హీరోయిన్ల వైపే ఉంటుంది. ప్ర‌స్తుతం ఆదిత్య‌ క‌పూర్ అనే కొత్త అబ్బాయి స‌ర‌సన “ఫితూర్” అనే ఒక ల‌వ్ స్టోరి చేస్తుంది. ప్రేమికుల దినోత్సవం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకోణ్ .. హాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుంటున్నారు. దీంతో క‌త్రీనా కైఫ్ చూపు కూడా హాలీవుడ్ మీద ప‌డింది. హాలీవుడ్ సినిమాల్లో నటించే అవ‌కాశం వ‌స్తే వ‌ద‌లుకునే ప్ర‌స‌క్తే లేదంటోంది. మ‌రి క‌త్రీనా కైఫ్ ఆశ ఎప్ప‌టికి నిజం అవుతుందో చూడాలి మరి.

First Published:  10 Feb 2016 12:51 AM GMT
Next Story