Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ సింగ్ మరో రికార్డు సృష్టించాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రికార్డు సృష్టించాడు. విడుదలకు ముందే తన సినిమాలతో రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా చేసుకున్న పవన్… తాజాగా మరో రికార్డు కొల్లగొట్టాడు. తన అప్ కమింగ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను నైజాంలో రికార్డు మొత్తానికి అమ్మేశాడు పవన్. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 20కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు చిత్రసీమ చరిత్రలో… బాహుబలి తర్వాత అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన సినిమాగా సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డు […]

గబ్బర్ సింగ్ మరో రికార్డు సృష్టించాడు
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రికార్డు సృష్టించాడు. విడుదలకు ముందే తన సినిమాలతో రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా చేసుకున్న పవన్… తాజాగా మరో రికార్డు కొల్లగొట్టాడు. తన అప్ కమింగ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను నైజాంలో రికార్డు మొత్తానికి అమ్మేశాడు పవన్. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 20కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు చిత్రసీమ చరిత్రలో… బాహుబలి తర్వాత అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన సినిమాగా సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డు సృష్టించింది.
నైజాంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు.. మొదట ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నించాడు. అయితే 20కోట్ల మొత్తం అనేసరికి దిల్ రాజే కళ్లు తేలేసి పక్కకు తప్పుకున్నాడని సమాచారం. తాజాగా ఇంద్ర ఫిలిమ్స్ అనే సంస్థ ఈ సినిమా నైజాం రైట్స్ ను దక్కించుకుంది. బాబి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు స్వయంగా పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్లే సమకూర్చిన విషయం అందరికీ తెలిసిందే. పైగా… ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే నైజాం హక్కులకు 20కోట్లు పెట్టేందుకు సదరు సంస్థ వెనకాడలేదు.
First Published:  9 Feb 2016 5:15 AM GMT
Next Story