Telugu Global
Cinema & Entertainment

మరోసారి మజ్నూగా నాగార్జున

కెరీర్ స్టార్టింగ్ లో నాగార్జునకు బూస్టింగ్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి మజ్నూ. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ కొందరికి గుర్తే. అలాంటి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో ఇప్పుడు నాగ్ కొడుకు నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఈమధ్యే మజ్నూ సెట్స్ లో నాగార్జున కనిపిస్తే….. ఊరికే వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ ఒక్క రోజులోనే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడట నాగ్. […]

మరోసారి మజ్నూగా నాగార్జున
X
కెరీర్ స్టార్టింగ్ లో నాగార్జునకు బూస్టింగ్ ఇచ్చిన సినిమాల్లో ఒకటి మజ్నూ. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ కొందరికి గుర్తే. అలాంటి సూపర్ హిట్ సినిమా టైటిల్ తో ఇప్పుడు నాగ్ కొడుకు నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు నాగార్జున కూడా నటిస్తున్నాడు. ఈమధ్యే మజ్నూ సెట్స్ లో నాగార్జున కనిపిస్తే….. ఊరికే వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ ఒక్క రోజులోనే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడట నాగ్. మనం సినిమా తర్వాత నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన రెండో సినిమాగా మజ్నూ నిలిచిపోతుంది. కేవలం ఓ అతిథి పాత్రలో మాత్రమే మజ్నూలో నాగార్జున కనిపిస్తాడు. మరోవైపు నాగ్ తో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడు. వెంకీకి సంబంధించిన సన్నివేశాల్ని కూడా ఈమధ్యే చిత్రీకరించారు. గతంలో కార్తికేయ సినిమాను తెరకెక్కించిన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మజ్నూను తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా…. అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ సెకెండ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.
First Published:  8 Feb 2016 3:24 AM GMT
Next Story