Telugu Global
WOMEN

సాధికార‌త త‌రువాత... ముందు టాయిలెట్లు చూపించండి!

మ‌హిళా సాధికార‌త‌ని పెంచేందుకు పోలీస్ శాఖ‌లో వారి సంఖ్య‌ని పెంచాల‌ని  కేంద్ర‌ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అవ‌కాశాల‌నూ క‌ల్పిస్తోంది. అయితే ఈ శాఖ‌లో ప‌నిచేసే మ‌హిళ‌లు ఏమంటున్నారు, వారు సౌక‌ర్య‌వంతంగానే ఈ విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నారా అనే విష‌యంమీద ఒక స‌ర్వే నిర్వ‌హించిన‌పుడు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  స్కూళ్లలో టాయిలెట్ స‌దుపాయం లేక ఆడ‌పిల్లలు మంచినీళ్లు తాగ‌టం లేద‌నే వార్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు విన్నాం. కానీ మ‌హిళా పోలీసుల‌ది సైతం అదే దుస్థితి అని స‌ర్వేలో తేలింది. ఎలాంటి […]

సాధికార‌త త‌రువాత... ముందు టాయిలెట్లు చూపించండి!
X

మ‌హిళా సాధికార‌త‌ని పెంచేందుకు పోలీస్ శాఖ‌లో వారి సంఖ్య‌ని పెంచాల‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అవ‌కాశాల‌నూ క‌ల్పిస్తోంది. అయితే ఈ శాఖ‌లో ప‌నిచేసే మ‌హిళ‌లు ఏమంటున్నారు, వారు సౌక‌ర్య‌వంతంగానే ఈ విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నారా అనే విష‌యంమీద ఒక స‌ర్వే నిర్వ‌హించిన‌పుడు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. స్కూళ్లలో టాయిలెట్ స‌దుపాయం లేక ఆడ‌పిల్లలు మంచినీళ్లు తాగ‌టం లేద‌నే వార్త‌లు ఇప్ప‌టివ‌ర‌కు విన్నాం. కానీ మ‌హిళా పోలీసుల‌ది సైతం అదే దుస్థితి అని స‌ర్వేలో తేలింది. ఎలాంటి స‌దుపాయాలు లేని ప్రాంతాల్లో డ్యూటీలు చేయాల్సి వ‌చ్చిన‌పుడు వీరు వాష్‌రూం స‌దుపాయం లేక మంచినీళ్లు తాగ‌కుండా ఉంటున్నార‌ట‌. అలాగే వీరికి ర‌క్ష‌ణ కోసం ఇచ్చే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల వంటివి మ‌గ‌వారి శ‌రీర తీరుకి త‌గిన‌ట్టుగా త‌యారుచేస్తారు, వాటిని మ‌హిళ‌లు ధ‌రించిన‌పుడు ఊపిరి ఆడ‌న‌ట్ల‌యి ఇబ్బందులు ప‌డుతున్నారు.

కేంద్ర పోలీస్ బ‌ల‌గాల్లో 33శాతం కానిస్టేబుల్ ఉద్యోగాలు, ర‌క్ష‌ణ శాఖ‌లో 15శాతం ర‌క్ష‌ణ ద‌ళాల పోస్టులు మ‌హిళ‌ల‌కు ఇవ్వాల‌ని కేంద్ర హోంశాఖ నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఈ స‌ర్వే ఫ‌లితాలు మ‌రింత ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకున్నాయి. భ‌ద్ర‌త, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా వ‌స‌తి విషయంలో మ‌గ‌వారిలా కాకుండా త‌మ‌కు కాస్త మెరుగైన‌ స‌దుపాయాలు, ఏకాంతం కావాలని మ‌హిళా పోలీసులు కోరుతున్నారు. త‌మకు దుస్తుల ను ‌ ఉత‌క‌డం, ఆర‌వేయ‌టం లాంటివి చాలా ఇబ్బందిగా మారుతున్నాయ‌ని వీరు తెలిపారు. స్త్రీల‌తో మ‌రిన్ని ప‌నులు చేయించుకుంటూ, మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించేస్తే సాధికార‌త రాదు, వారి భ‌ద్ర‌త‌కు, ఆరోగ్యానికి, మ‌ర్యాద, గౌర‌వాల‌కు భంగం క‌ల‌గ‌ని రీతిలో, అవ‌స‌ర‌మైన క‌నీస స‌దుపాయాలు క‌ల్పించిన‌పుడే అది సాధ్య‌మ‌వుతుంది. అలా జ‌ర‌గ‌నంత‌కాలం వారి ఉనికిని ఇంకా స‌మాజం, ప్ర‌భుత్వం గుర్తించ‌న‌ట్టుగానే భావించాలి మ‌రి.

First Published:  8 Feb 2016 5:16 AM GMT
Next Story