Telugu Global
Cinema & Entertainment

భ‌ల్లాల దేవకి… పిల్ల దొర‌క‌దా?

రాజ‌మౌళి హీరోలు అమ్మాయిల మ‌న‌సుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటారు. అందులో సందేహం లేదు. య‌మ‌దొంగ‌, ఈగ‌, మ‌ర్యాద రామ‌న్న నుండి నేటి బాహుబ‌లి వ‌ర‌కు హీరోహీరోయిన్ల మ‌ధ్య ఉన్న బంధాన్ని ఏదో పాట‌లతో స‌రిపెట్టకుండా ప్రేక్షకుల‌ మ‌న‌సుల‌కు ఆక‌ట్టుకునేలా రాజ‌మౌళి చిత్రీక‌రించాడు. మ‌రి హీరోలు ఇలా ఉన్న‌పుడు విల‌న్లు వీరికి స‌రిగ్గా వ్య‌తిరేకంగానే ఉండాలి క‌దా…అలాగే ఉంటారు. అంత క్రూరంగా, ఘోరంగా, మూర్ఖంగా. అమ్మాయిల‌ను భ‌య‌పెట్టేలా. అందుకే రానా, బాహుబ‌లి ముగింపు సినిమా త‌రువాత త‌న‌ను పెళ్లి చేసుకునేందుకు […]

భ‌ల్లాల దేవకి… పిల్ల దొర‌క‌దా?
X

రాజ‌మౌళి హీరోలు అమ్మాయిల మ‌న‌సుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటారు. అందులో సందేహం లేదు. య‌మ‌దొంగ‌, ఈగ‌, మ‌ర్యాద రామ‌న్న నుండి నేటి బాహుబ‌లి వ‌ర‌కు హీరోహీరోయిన్ల మ‌ధ్య ఉన్న బంధాన్ని ఏదో పాట‌లతో స‌రిపెట్టకుండా ప్రేక్షకుల‌ మ‌న‌సుల‌కు ఆక‌ట్టుకునేలా రాజ‌మౌళి చిత్రీక‌రించాడు. మ‌రి హీరోలు ఇలా ఉన్న‌పుడు విల‌న్లు వీరికి స‌రిగ్గా వ్య‌తిరేకంగానే ఉండాలి క‌దా…అలాగే ఉంటారు. అంత క్రూరంగా, ఘోరంగా, మూర్ఖంగా. అమ్మాయిల‌ను భ‌య‌పెట్టేలా. అందుకే రానా, బాహుబ‌లి ముగింపు సినిమా త‌రువాత త‌న‌ను పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయీ ఒప్పుకోదంటున్నాడు. అంత రాక్ష‌సంగా ఉంటుంద‌ట ఆ పాత్ర‌. కోలీవుడ్ సినిమా బెంగ‌లూరు నాట‌క‌ల్ త‌రువాత రానా దృష్టి అంతా ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఘ‌జీ మీదే ఉంది. బాలివుడ్ సినిమాల్లో కూడా న‌టిస్తున్న రానా మీద పుకార్లు ఎక్కువ‌గానే వినిపిస్తుంటాయి. అయితే అత‌ను వాటిని లైట్‌గానే తీసుకుంటున్నాడు. గాసిప్స్ కాకుండా…రానా మార్నింగ్ వాకింగ్‌కి వెళ్లాడు, జిమ్‌కి వెళ్లి క‌ష్ట‌ప‌డుతున్నాడు… లాంటి వార్త‌లు రాస్తే ఎవ‌రూ చ‌ద‌వరు క‌దా… అని అత‌ను ఓ ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేశాడు కూడా.

First Published:  8 Feb 2016 3:14 AM GMT
Next Story