Telugu Global
Health & Life Style

గెలుపంటే ఇత‌రుల‌ను ఓడించ‌డం కాదు!

విజ‌యం…ఇది చాలా బాగుంటుంది. అయితే విజ‌యానికి నిజాయితీకి సంబంధంలేదు. ఎందుకంటే కొంత‌మంది ఎలాగైనా, ఏం చేసైనా గెలిచితీరాలి, న‌లుగురిలో చాలా గొప్ప‌గా ఉండాల‌ని అనుకుంటారు. విజ‌యం అంటే ఇత‌రుల‌పై గెలుపు… అని మాత్ర‌మే అనుకుంటారు అలాంటివారు.  అయితే కొన్ని అధ్య‌య‌నాల్లో తేలిన‌దేమిటంటే, ఇలా… స‌మాజంలో ఇత‌రుల‌కంటే గొప్ప‌గా ఉండాల‌ని, ఇత‌రుల‌ను అధిగ‌మించాల‌నే ఆశ‌యంతో విజయం సాధించేవారిలో నిజాయితీ పాళ్లు త‌క్కువ‌గా ఉంటాయ‌ట‌. వారు త‌రువాత కూడా అవినీతికి పాల్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. అలా కాకుండా విజ‌యాన్ని, […]

గెలుపంటే ఇత‌రుల‌ను ఓడించ‌డం కాదు!
X

విజ‌యం…ఇది చాలా బాగుంటుంది. అయితే విజ‌యానికి నిజాయితీకి సంబంధంలేదు. ఎందుకంటే కొంత‌మంది ఎలాగైనా, ఏం చేసైనా గెలిచితీరాలి, న‌లుగురిలో చాలా గొప్ప‌గా ఉండాల‌ని అనుకుంటారు. విజ‌యం అంటే ఇత‌రుల‌పై గెలుపు… అని మాత్ర‌మే అనుకుంటారు అలాంటివారు. అయితే కొన్ని అధ్య‌య‌నాల్లో తేలిన‌దేమిటంటే, ఇలా… స‌మాజంలో ఇత‌రుల‌కంటే గొప్ప‌గా ఉండాల‌ని, ఇత‌రుల‌ను అధిగ‌మించాల‌నే ఆశ‌యంతో విజయం సాధించేవారిలో నిజాయితీ పాళ్లు త‌క్కువ‌గా ఉంటాయ‌ట‌. వారు త‌రువాత కూడా అవినీతికి పాల్ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. అలా కాకుండా విజ‌యాన్ని, ఇత‌రుల ఓట‌మిగా కాక, త‌న‌ వ్యక్తిగ‌త గెలుపుగా, తన‌ను తాను అధిగ‌మించి ముందుకు వేసే అడుగుగా, ఒక అభివృద్ధిగా భావించేవారిలో నిజాయితీ ఉంటుంద‌ట‌.

విజ‌యం గురించి జ‌రిపిన మ‌రొక అధ్య‌య‌నంలో మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తేలింది. జీవితంలో మొద‌టి విజ‌యం, త‌మ‌లోని ప్రావీణ్యం, తెలివితేట‌ల వ‌ల‌న కాకుండా ఇత‌ర కార‌ణాల వ‌లన ద‌క్కితే వారు జీవితంలో, త‌మ నైపుణ్యంతో మొద‌టి విజ‌యాన్ని సాధించిన‌వారిలా ఎద‌గ‌లేర‌ట‌. అంతేకాదు, చిన్న‌త‌నంలోనే చాలా పెద్ద విజ‌యాన్ని చూసిన‌వారు త‌రువాతి జీవితంలో ఆ స్థాయిలో స‌క్సెస్‌ల‌ను సాధించ‌లేర‌ని కూడా ఈ అధ్య‌య‌నం చెబుతోంది.

గెలుపు అనేది ఒక సంఘ‌ట‌న‌కో, ఒక వ్య‌క్తిమీద గెలుపుకో సంబంధిన‌ది కాదు, అదొక నిరంత‌ర ప్ర‌క్రియ‌, మాన‌సిక భావ‌న‌. అందుకే ఎలాంటి ఒత్తిడుల‌కు గురికాకుండా, స‌హ‌జంగా త‌మ‌ని తాము మెరుగుప‌రుచుకుంటూ ముందుకు వెళ్లేవారికి విజ‌యం కంటే, నిరంత‌ర సాధ‌న, మ‌రింత ఎక్కువ‌గా తెలుసుకోవ‌డం, నైపుణ్యం సాధించ‌డం వంటివి ఎక్కువ కిక్‌ని ఇస్తాయి.

First Published:  8 Feb 2016 6:59 AM GMT
Next Story