Telugu Global
NEWS

తగ్గని రేవంత్ – ఖేడ్‌లో కేసీఆర్‌ ఫ్యామిలీపై పంచ్‌లు

గ్రేటర్‌లో టీడీపీ ఓడిపోయినా  రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. టీడీపీ నేతలు నిరుత్సాహంలో కూరుకుపోయినా రేవంత్‌ మాత్రం ఫైట్ ఫైటే అంటున్నారు.  తాజాగా నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల ప్రచారంలోకి రేవంత్ దిగారు. గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో గానీ రేవంత్‌ మాటల్లో పదునుమాత్రం తగ్గడం లేదు.  మరోసారి ఇదివరకు లాగా కేసీఆర్‌ ఫ్యామిలీపై విమర్శలు చేశారు.  టీఆర్ఎస్ అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో క్యాబేజీ పండిస్తుంటే వాటిని తెచ్చి […]

తగ్గని రేవంత్ – ఖేడ్‌లో కేసీఆర్‌ ఫ్యామిలీపై పంచ్‌లు
X

గ్రేటర్‌లో టీడీపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. టీడీపీ నేతలు నిరుత్సాహంలో కూరుకుపోయినా రేవంత్‌ మాత్రం ఫైట్ ఫైటే అంటున్నారు. తాజాగా నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల ప్రచారంలోకి రేవంత్ దిగారు. గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో గానీ రేవంత్‌ మాటల్లో పదునుమాత్రం తగ్గడం లేదు. మరోసారి ఇదివరకు లాగా కేసీఆర్‌ ఫ్యామిలీపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు.

కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో క్యాబేజీ పండిస్తుంటే వాటిని తెచ్చి నారాయణఖేడ్ ప్రజల చెవిలో పెట్టేందుకు అల్లుడు హరీష్‌ రావు ప్రయత్నిస్తున్నారని పంచ్‌ విసిరారు. టీఆర్ఎస్‌లో హరీష్‌ రావుకే గతి లేకుండా పోయిందని… కేసీఆర్ వారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించడం కూడా పూర్తయిందన్నారు. అలాంటి హరీష్‌రావు నారాయణఖేడ్‌ను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కొడుకు చేతిలో తాగునీరు, అల్లుడి చేతిలో సాగు నీటి శాఖలు పెట్టారన్నారు. 20 నెలల్లో నారాయణఖేడ్‌లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని రేవంత్ నిలదీశారు.

Click on Image to Read:

nara-rohit

rayapati-sambasiva-rao

dasari-narayana-rao-fire-on

revanth-reddy

jagan

pawan-rgv

9898

pawan

babu-amitsha

mudragada1

First Published:  7 Feb 2016 12:40 PM GMT
Next Story