Telugu Global
NEWS

నాన్న కోసం ఎన్టీఆర్ సినిమా చూస్తా...

గ్రేటర్ గెలుపుతో ఊపుమీదున్న కేటీఆర్ మాటిది. అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు నడిపించి… బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజయతీరానికి చేర్చారు కేటీఆర్. ఈ విజయం కచ్చితంగా కేటీఆర్ దే నంటూ ప్రతిఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు… తాజా విజయంతో…. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తిరుగులేని స్థానం సంపాదించుకున్నారని కూడా అంటున్నారు. తన నాన్నకు ప్రేమతో కేటీఆర్ అందించిన గుర్తుగా ఈ విజయాన్ని చెప్పుకొస్తుున్నారు. దీనికి కొనసాగింపుగా… నాన్నకు ప్రేమతో అంటూ కేసీఆర్-కేటీఆర్ ఫొటోలతో సోషల్ మీడియాలో […]

నాన్న కోసం ఎన్టీఆర్ సినిమా చూస్తా...
X
గ్రేటర్ గెలుపుతో ఊపుమీదున్న కేటీఆర్ మాటిది. అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు నడిపించి… బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజయతీరానికి చేర్చారు కేటీఆర్. ఈ విజయం కచ్చితంగా కేటీఆర్ దే నంటూ ప్రతిఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు… తాజా విజయంతో…. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తిరుగులేని స్థానం సంపాదించుకున్నారని కూడా అంటున్నారు. తన నాన్నకు ప్రేమతో కేటీఆర్ అందించిన గుర్తుగా ఈ విజయాన్ని చెప్పుకొస్తుున్నారు. దీనికి కొనసాగింపుగా… నాన్నకు ప్రేమతో అంటూ కేసీఆర్-కేటీఆర్ ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ హంగామా జరిగింది. పత్రికల్లో, టీవీల్లో కూడా ప్రముఖంగా ఇదే పేరు వినిపించడంతో… ఈ సినిమాపై కేటీఆర్ ఆరా తీశారట. అన్నీ తెలుసుకున్న తర్వాత కచ్చితంగా వీలు చూసుకొని సినిమా చూస్తానని కేటీఆర్ సన్నిహితులతో అన్నట్టు సమాచారం. అలా గ్రేటర్ ఎన్నికల మూలంగా నాన్నకు ప్రేమతో సినిమాకు మరోసారి ఊపొచ్చింది.
First Published:  6 Feb 2016 10:08 PM GMT
Next Story