Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాలో 10 మంది హీరోయిన్స్ లీడ్ రోల్స్ లో

తెలుగులో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చాల త‌క్కువ‌నే చెప్పాలి. ఒక్కటి రెండు వ‌చ్చినా ఆ సినిమాలు కూడా క‌చ్చితంగా హీరో సెంట్రిక్ గానే వుంటాయి. ఆ మ‌ధ్య వ‌చ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు .. గోపాల గోపాలా , మ‌సాలా చిత్రాలు ఇదే త‌ర‌హాలో వ‌చ్చాయి. హీరోయిన్స్ అది కూడా స్టార్ హీరోయిన్స్ అంద‌రు క‌ల‌సి ఒక చిత్రంలో న‌టించ‌డం అనేది మన టాలీవుడ్ లో అరుదు. స్టార్ హీరోయిన్స్ ప‌ది మందితో క‌ల‌సి ఒక […]

ఆ సినిమాలో 10 మంది హీరోయిన్స్ లీడ్ రోల్స్ లో
X

తెలుగులో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చాల త‌క్కువ‌నే చెప్పాలి. ఒక్కటి రెండు వ‌చ్చినా ఆ సినిమాలు కూడా క‌చ్చితంగా హీరో సెంట్రిక్ గానే వుంటాయి. ఆ మ‌ధ్య వ‌చ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు .. గోపాల గోపాలా , మ‌సాలా చిత్రాలు ఇదే త‌ర‌హాలో వ‌చ్చాయి. హీరోయిన్స్ అది కూడా స్టార్ హీరోయిన్స్ అంద‌రు క‌ల‌సి ఒక చిత్రంలో న‌టించ‌డం అనేది మన టాలీవుడ్ లో అరుదు. స్టార్ హీరోయిన్స్ ప‌ది మందితో క‌ల‌సి ఒక చిత్ర‌మంటే నిజంగా గొప్ప ప్ర‌య‌త్న‌మే. ఏదో క‌నిపించారంటే క‌నిపించార‌న్న‌ట్లు కాకుండా.. ప‌ది మంది స్టార్ హీరోయిన్స్ ఫుల్ లెంగ్త్ లో సినిమా చేసే ఆలోచ‌న పీవిపి నిర్మాణ సంస్థ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ లో స‌మాచారం. అనుష్క‌, స‌మంత , కాజ‌ల్ వంటి స్టార్ హీరోయిన్స్ తో పాటు.. అన‌సూయ‌, రెష్మీ వంటి స్మాల్ స్క్రీన్ హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో న‌టించ బోతున్నార‌ట‌. ఇక ఇప్పటికే సైజ్ జీరో, క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ప్రమోట్ చేస్తున్న పివిపి సంస్థ, ఒకే సినిమాలలో పది మంది హీరోయిన్లు ఉంటే ఇంకే స్థాయిలో తెరకెక్కిస్తుందో చూడాలి.!

First Published:  6 Feb 2016 11:57 PM GMT
Next Story