Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాలో నటీనటులు లేరు... అంతా రోబోలే...

ప్రస్తుతం రోబో 2.0 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరూ ఉండరట. అంతా రోబోలే కనిపిస్తాయట. మొదటి భాగంలో మనిషిగా, మరమనిషిగా కనిపించిన రజనీకాంత్…. రెండో భాగంగా పూర్తిగా రోబోగానే కనిపిస్తాడట. ఇక హీరోయిన్ అమీజాక్సన్ కూడా రోబోనేనట. ఇలా రెండు హ్యూమనాయిడ్ రోబోల మధ్య రొమాన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అన్నిటికంటే ముఖ్యమైన […]

ఆ సినిమాలో నటీనటులు లేరు... అంతా రోబోలే...
X
ప్రస్తుతం రోబో 2.0 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరూ ఉండరట. అంతా రోబోలే కనిపిస్తాయట. మొదటి భాగంలో మనిషిగా, మరమనిషిగా కనిపించిన రజనీకాంత్…. రెండో భాగంగా పూర్తిగా రోబోగానే కనిపిస్తాడట. ఇక హీరోయిన్ అమీజాక్సన్ కూడా రోబోనేనట. ఇలా రెండు హ్యూమనాయిడ్ రోబోల మధ్య రొమాన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే…. విలన్ గా కనిపిస్తున్న అక్షయ్ కుమార్… ఈ రెండు రోబోల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తాడట. అయితే చెడు కోసం తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న విలన్ అక్షయ్ కుమార్ ను… రోబోలా ఉన్న రజనీకాంత్ ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా కథగా చెప్పుకుంటున్నారు. అంటే…మనిషి, రోబోను నియంత్రించడం కాకుండా… ఈ సినిమాలో రోబోనే ఓ మనిషిని ఓడిస్తుందన్నమాట. ఇలాంటి డిఫరెంట్ స్టోరీతోనే రోబో-2.0 తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై దర్శకుడు శంకర్… ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
First Published:  6 Feb 2016 5:48 AM GMT
Next Story