Telugu Global
Health & Life Style

బ్రేక్‌ఫాస్ట్‌...గుండెకు పండ‌గ‌!

ఉద‌యం పూట తీసుకునే టిఫిన్‌, అల్పాహారం, లేదా బ్రేక్‌ఫాస్ట్…పేరు ఏదైనా అది మ‌న‌కు చేసే మేలు చాలానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఉద‌యం పూట తీసుకునే ఆహారం మ‌న గుండె ఆరోగ్యాన్ని చెద‌ర‌నీయ‌కుండా కాపాడుతుంద‌ట‌. అందుకే పొట్ట నిండుగా అనిపించినా, గుండెని గుర్తు తెచ్చుకుని పొద్దున పూట మంచి పోష‌కాహారం తీసుకోవ‌డ‌మే మంచిది. జపాన్‌కి చెందిన 82,772 మంది  పురుషులు, మ‌హిళ‌ల‌పై ఈ విష‌యంలో నిర్వ‌హించిన అధ్య‌య‌నాల్లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఉద‌యపు ఆహారాన్ని తీసుకోకపోతే […]

బ్రేక్‌ఫాస్ట్‌...గుండెకు పండ‌గ‌!
X

ఉద‌యం పూట తీసుకునే టిఫిన్‌, అల్పాహారం, లేదా బ్రేక్‌ఫాస్ట్…పేరు ఏదైనా అది మ‌న‌కు చేసే మేలు చాలానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఉద‌యం పూట తీసుకునే ఆహారం మ‌న గుండె ఆరోగ్యాన్ని చెద‌ర‌నీయ‌కుండా కాపాడుతుంద‌ట‌. అందుకే పొట్ట నిండుగా అనిపించినా, గుండెని గుర్తు తెచ్చుకుని పొద్దున పూట మంచి పోష‌కాహారం తీసుకోవ‌డ‌మే మంచిది. జపాన్‌కి చెందిన 82,772 మంది పురుషులు, మ‌హిళ‌ల‌పై ఈ విష‌యంలో నిర్వ‌హించిన అధ్య‌య‌నాల్లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఉద‌యపు ఆహారాన్ని తీసుకోకపోతే గుండెవ్యాధులే కాదు, గుండె, మెద‌డు స్ట్రోక్ కూడా రావ‌చ్చ‌ని ఆ అధ్య‌య‌నాలు నిర్వ‌హించిన వైద్య నిపుణులు గ‌ట్టిగా చెబుతున్నారు.

ప్ర‌తిరోజూ అల్పాహారం తీసుకోని వారిలో, వారానికి రెండుసార్లు మాత్ర‌మే టిఫిన్ చేసేవారిలో….

  • స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం పెరుగుతాయి.
  • మెద‌డులో ర‌క్త‌స్రావం జ‌రిగే ప్ర‌మాదం 48శాతం పెరుగుతుంది.
  • గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం 43శాతం పెరుగుతుంది.

త‌ర‌చుగా ఉద‌యపు ఆహారాన్ని మానేసే వారిలో గుండె, మెద‌డుకి సంబంధించిన స్ట్రోక్ ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్టుగా స్ప‌ష్టంగా వెల్ల‌డైంది. ఇత‌ర జీవ‌న శైలి ల‌క్ష‌ణాలు, వ్య‌స‌నాలు అన్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చూసినా ఉద‌య‌పు ఆహారం గుండె, మెద‌డు ఆరోగ్యంమీద ఎక్కువ ఫ‌లితాన్ని చూపుతుంద‌ని నిపుణులు తేల్చారు. అంతేకాదు, అధిక‌బ‌రువుకి గురికాకుండా ఉండాల‌న్నా బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్ చేయ‌కండ‌ని వీరు స‌ల‌హా ఇస్తున్నారు.

First Published:  5 Feb 2016 9:26 AM GMT
Next Story