Telugu Global
Cinema & Entertainment

అమ్మా నాన ఆటలో రమ్యకృష్ణ, కమల్

సెకెండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న రమ్యకృష్ణ…. మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకుంది. ఏకంగా కమల్ హాసన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. గతంలో పంచతంత్రం సినిమాలో కమల్ సరసన ఓ చిన్న పాత్ర చేసిన రమ్యకృష్ణ… ఈసారి ఏకంగా అతడి సరసన హీరోయిన్ గా సెటిలైంది. మరీ ముఖ్యంగా అమల స్థానంలోకి రమ్యకృష్ణ రావడం సంచలనం అయింది. కమల్ హాసన్-అమల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అమ్మ-నాన్న-ఆట అనే […]

అమ్మా నాన ఆటలో రమ్యకృష్ణ, కమల్
X
సెకెండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న రమ్యకృష్ణ…. మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకుంది. ఏకంగా కమల్ హాసన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. గతంలో పంచతంత్రం సినిమాలో కమల్ సరసన ఓ చిన్న పాత్ర చేసిన రమ్యకృష్ణ… ఈసారి ఏకంగా అతడి సరసన హీరోయిన్ గా సెటిలైంది. మరీ ముఖ్యంగా అమల స్థానంలోకి రమ్యకృష్ణ రావడం సంచలనం అయింది. కమల్ హాసన్-అమల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అమ్మ-నాన్న-ఆట అనే పేరుపెట్టారు. ఇప్పుడీ సినిమా నుంచి అమలను తప్పించి రమ్యకృష్ణను తీసుకున్నారట. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమాను ఒకేసారి తమిళ-మలయాళ-తెలుగు భాషల్లో చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో కమల్ కూతురిగా శృతిహాసన్ నటించనుంది. అమ్మ-నాన్న-కూతురు మధ్య ఉండే భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.
First Published:  3 Feb 2016 11:28 PM GMT
Next Story