Telugu Global
Cinema & Entertainment

దెయ్యం పాత్ర‌లో ర‌మ్య కృష్ణ‌

ఇప్ప‌టివ‌ర‌కు దేవ‌తా మూర్తుల పాత్ర‌ల్లో క‌రుణ‌, రౌద్ర ర‌సాల‌ను, నీలాంబ‌రి లాంటి పాత్ర‌ల్లో విల‌నిజాన్ని ఆవిష్క‌రించిన ర‌మ్య కృష్ణ,  ఇప్పుడు భ‌యానక‌, బీభ‌త్స ర‌సాల‌ను కూడా తెర‌పై చూపించ‌నున్నారు.  త‌న భ‌ర్త కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న రుద్రాక్ష‌లో ఆమెది దెయ్యం పాత్ర. ఈ హార‌ర్ ఫాంట‌సీలో స‌మంత లీడ్ రోల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఎత్తున గ్రాఫిక్స్ ఉండ‌బోతున్న ఈ చిత్రంలో భ‌యాన‌క స‌న్నివేశాల‌న్నీ ర‌మ్య‌కృష్ణ‌ పాత్ర చుట్టూనే ఉంటాయ‌ని స‌మాచారం. ఆమె తన కెరీర్‌లో […]

దెయ్యం పాత్ర‌లో ర‌మ్య కృష్ణ‌
X

ఇప్ప‌టివ‌ర‌కు దేవ‌తా మూర్తుల పాత్ర‌ల్లో క‌రుణ‌, రౌద్ర ర‌సాల‌ను, నీలాంబ‌రి లాంటి పాత్ర‌ల్లో విల‌నిజాన్ని ఆవిష్క‌రించిన ర‌మ్య కృష్ణ, ఇప్పుడు భ‌యానక‌, బీభ‌త్స ర‌సాల‌ను కూడా తెర‌పై చూపించ‌నున్నారు. త‌న భ‌ర్త కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న రుద్రాక్ష‌లో ఆమెది దెయ్యం పాత్ర. ఈ హార‌ర్ ఫాంట‌సీలో స‌మంత లీడ్ రోల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఎత్తున గ్రాఫిక్స్ ఉండ‌బోతున్న ఈ చిత్రంలో భ‌యాన‌క స‌న్నివేశాల‌న్నీ ర‌మ్య‌కృష్ణ‌ పాత్ర చుట్టూనే ఉంటాయ‌ని స‌మాచారం. ఆమె తన కెరీర్‌లో ఎన్నో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్ని పోషించినా ఈ పాత్ర మ‌రింత ప్రాముఖ్య‌త క‌లిగిన‌దిగా భావిస్తున్నారు. అంతే‌కాదు, ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ల‌నే మ‌నం దెయ్యం పాత్ర‌ల్లో చూస్తూ వ‌స్తున్నాం. కానీ త‌న‌దైన శైలిలో విభిన్న పాత్ర‌లు పోషిస్తున్న ర‌మ్య కృష్ణ ఇప్పుడు ఇలాంటి పాత్ర‌ని చేయ‌బోతున్నారు. ఆమె త‌న జూనియ‌ర్స్ కంటే భిన్నంగా ఈ పాత్ర‌లో ఎలా రాణిస్తారో చూడాలి. అలాగే భ‌ర్త ఊహ‌ల్లో ఉన్న దెయ్యాన్ని ఎంత‌వ‌ర‌కు ఆవిష్క‌రిస్తారో కూడా వేచిచూడాలి.

First Published:  4 Feb 2016 5:31 AM GMT
Next Story