బాక్సాఫీస్ పందెం పుంజు సోగ్గాడే..!
సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు చిత్రాల్లో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సొగ్గాడేచిన్ని నాయనా చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. 20 కోట్ల బడ్జెట్ తో నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండగ రోజు దాదాపు 7 వందల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆద్యంతం సినిమాను దర్శకుడు కలర్ ఫుల్ […]
BY admin2 Feb 2016 3:47 PM IST

X
admin Updated On: 3 Feb 2016 6:01 AM IST
సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు చిత్రాల్లో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సొగ్గాడేచిన్ని నాయనా చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. 20 కోట్ల బడ్జెట్ తో నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండగ రోజు దాదాపు 7 వందల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆద్యంతం సినిమాను దర్శకుడు కలర్ ఫుల్ గా..జాయ్ ఫుల్ గా చేయడంతో సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేసింది. దీంతో 20 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం .. దాదాపు 40 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అంటే 20 కోట్ల రూపాయాలు ప్రాఫీట్ అన్నమాట. అంటే రూపాయికి రూపాయి లాభం తెచ్చింది. నాగార్జున రిలీజ్ కు ముందే చెప్పినట్లు ..ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం.
సొగ్గాడే తో పాటు రిలీజ్ అయినా నాన్నకు ప్రేమతో చిత్రం బడ్జెట్ 50 కోట్లు వరకు కష్టం మీద కలెక్ట్ చేయగలిగింది. బాలయ్య డిక్టేటర్ మాత్రం బయ్యర్లు ను నిరాశ పరిచిందనే చెప్పాలి. ఈ ముగ్గురి స్టార్స్ తో పోటి పడి వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా మంచి లాభాలు ఆర్జించినట్లు టాక్. మొత్తం మీద ఈసంక్రాంతికి నిజమైన బాక్సాఫీస్ పందెం పుంజు అంటే సొగ్గాడే మరి.అందుకే ఈసినిమాకు నాగార్జున సీక్వెల్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమచారాం.
Next Story