Telugu Global
CRIME

బోరుబావిలో ప‌డ‌కుండా ఆప‌లేమా... చిన్ని ప్రాణాల‌ను కాపాడ‌లేమా?

బోరుబావి మ‌రో రెండేళ్ల చిన్నారిని పొట్ట‌న‌బెట్టుకుంది. న‌ల్ల‌గొండ జిల్లాలో వ‌ల్లాల గ్రామంలో బోరుబావి గుంత‌లో ప‌డిన చిన్నారి శాన్వి ప్రాణాలు కోల్పోయింది.   క‌నీసం అయిదారునెల‌ల‌కు ఒక‌సారి ఇలాంటి హృద‌య‌విదార‌కమైన‌ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. పిల్ల‌లు మ‌ర‌ణిస్తూనే ఉన్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ నీరుప‌డ‌ని గుంత‌ల‌ను, వాటిని త‌వ్విన‌వారు అలా వ‌దిలేస్తూనే ఉన్నారు. పిల్ల‌లు ప‌డిపోయిన‌పుడు మ‌న‌కు వెంట‌నే స్పందించే అధికారులున్నారు, తవ్వ‌డానికి మ‌నుషులున్నారు, మ‌ట్టి ఎత్తిపోయ‌డానికి ప్రొక్లెయిన్లున్నాయి, ఆక్సిజ‌న్‌ని లోప‌లికి అందించ‌డానికి 108 సిబ్బంది ఉంది, బావిలోప‌లికి సిసి […]

బోరుబావిలో ప‌డ‌కుండా ఆప‌లేమా...  చిన్ని ప్రాణాల‌ను కాపాడ‌లేమా?
X

బోరుబావి మ‌రో రెండేళ్ల చిన్నారిని పొట్ట‌న‌బెట్టుకుంది. న‌ల్ల‌గొండ జిల్లాలో వ‌ల్లాల గ్రామంలో బోరుబావి గుంత‌లో ప‌డిన చిన్నారి శాన్వి ప్రాణాలు కోల్పోయింది. క‌నీసం అయిదారునెల‌ల‌కు ఒక‌సారి ఇలాంటి హృద‌య‌విదార‌కమైన‌ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. పిల్ల‌లు మ‌ర‌ణిస్తూనే ఉన్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ నీరుప‌డ‌ని గుంత‌ల‌ను, వాటిని త‌వ్విన‌వారు అలా వ‌దిలేస్తూనే ఉన్నారు.

పిల్ల‌లు ప‌డిపోయిన‌పుడు మ‌న‌కు వెంట‌నే స్పందించే అధికారులున్నారు, తవ్వ‌డానికి మ‌నుషులున్నారు, మ‌ట్టి ఎత్తిపోయ‌డానికి ప్రొక్లెయిన్లున్నాయి, ఆక్సిజ‌న్‌ని లోప‌లికి అందించ‌డానికి 108 సిబ్బంది ఉంది, బావిలోప‌లికి సిసి కెమెరాల‌ను పంప‌గ‌ల టెక్నాల‌జీ ఉంది, మ‌ర‌ణించాక బాద‌ప‌డి సంతాపం తెల‌ప‌డానికి నేత‌లున్నారు….కానీ త‌వ్విన వెంట‌నే దాన్ని పూడ్చేయాల‌నే చిన్న‌పాటి విజ్ఞ‌త లేదు, అలాంటి గుంట‌ల‌ను పూడ్చ‌క‌పోతే శిక్ష‌ని వేసే చ‌ట్టాలు అమలుకావడంలేదు. మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న చిత్త‌శుద్ధి లేదు…..పిల్ల‌ల‌ను కొట్టినా, పిల్ల‌ల ఏడుపు వినిపించినా త‌ల్లిదండ్రుల‌ను శిక్షించే చ‌ట్టాలు కొన్నిదేశాల్లో ఉన్నాయి. కానీ కేవ‌లం కొంత‌మంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్న చిన్నారుల కోసం ఇక్క‌డ ఎవ‌రూ ఏమీ చేయ‌లేక‌పోవ‌డం విషాదాల్లోకెల్లా విషాదం. పిల్ల‌లు ప‌డిన వెంట‌నే స్పందించ‌డం కంటే ముందు…ప‌డ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వాలు స్పందించాలి., మ‌రో చిన్నారిని మ‌రో గుంట‌కి బ‌లికాకుండా చూడాలి.

First Published:  2 Feb 2016 5:43 AM GMT
Next Story