రాంచరణ్.. డైరెక్టర్ ల మధ్య హీరోయిన్ గొడవ..!
ఎన్ని హిట్స్ ఇచ్చాం అన్నది కాదు.. రిలీజ్ అయిన ప్రతి సినిమాతో మెప్పించారా లేదా అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌కు ముఖ్యం అయ్యింది. గత చరిత్ర.. కెరీర్ లో ఎప్పుడో ఇచ్చిన హిట్స్ గురించి మాట్లాడుకునే ఓపిక అభిమానులకు లేనట్లే కనిపిస్తుంది. మంచి హిట్ పడాలంటే.. ముందు హీరోకు..దర్శకుడుకి సమన్వయం కుదరాలి. లేక పోతే కథ ఎంతమంచిదైనా అంతేసంగతులు. గత యేడాది దసరా పండక్కు బ్రూస్ లీ చిత్రంతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న […]
BY admin2 Feb 2016 6:55 AM GMT
X
admin Updated On: 2 Feb 2016 7:15 AM GMT
ఎన్ని హిట్స్ ఇచ్చాం అన్నది కాదు.. రిలీజ్ అయిన ప్రతి సినిమాతో మెప్పించారా లేదా అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌కు ముఖ్యం అయ్యింది. గత చరిత్ర.. కెరీర్ లో ఎప్పుడో ఇచ్చిన హిట్స్ గురించి మాట్లాడుకునే ఓపిక అభిమానులకు లేనట్లే కనిపిస్తుంది. మంచి హిట్ పడాలంటే.. ముందు హీరోకు..దర్శకుడుకి సమన్వయం కుదరాలి. లేక పోతే కథ ఎంతమంచిదైనా అంతేసంగతులు. గత యేడాది దసరా పండక్కు బ్రూస్ లీ చిత్రంతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న రాంచరణ్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ అవసరం. ఈ తరుణంలో తమిళ్ లో హిట్ అయిన తన్నీ ఓరువన్ సినిమాను దర్శకుడు సురేంద్ర రెడ్డి తో చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. కట్ చేస్తే. చెర్రీ సరసన ఇలియానాను హీరోయిన్గా తీసుకోవాలని సురేందర్ ఆలోచన.
కానీ, ఆమెని తీసుకునేందుకు ససేమిరా అంటున్నాడట చెర్రీ. ఫామ్ లేక నానాకష్టాలు పడుతున్న ఇల్లీని తీసుకుంటే రాంగ్ అవుతుందని చరణ్ భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఈమె ప్లేస్‌లో కొత్త బ్యూటీని ఎంపిక చేయమని పట్టుబడుతున్నాడట. కానీ, సురేందర్ అందుకు అంగీకరించడం లేదని ఇన్సైడ్ సమాచారం. ఎందుకంటే ‘కిక్’లో ఇలియానా నటించడంతోపాటు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో ఇల్లీ సెంటిమెంట్ ఈ డైరెక్టర్‌కి వెంటాడుతోందట. మరి చీవరకు ఈ విషయంలో ఎవరు గెలుస్తారో!.అన్ని అనుకూలిస్తే..ఈ నెల 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనేది సురేందర్‌రెడ్డి ప్లాన్ అంటున్నారు ఆయన సన్నిహితులు మరి.!
Next Story