Telugu Global
NEWS

కాపు గర్జన- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు# కాపు గర్జన సభ తర్వాత పరిణామాలు ఉద్రిక్తతంగా మారాయి. వేలాది మంది కాపులు రైలు పట్టాలపై, జాతీయ రహదారిపై బైఠాయించారు. వేలాది మంది ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొందరు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు.  బోగీలు, ఇంజన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దెత్తున చెలరేగాయి. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. పీఎస్ […]

కాపు గర్జన- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం
X

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు#

కాపు గర్జన సభ తర్వాత పరిణామాలు ఉద్రిక్తతంగా మారాయి. వేలాది మంది కాపులు రైలు పట్టాలపై, జాతీయ రహదారిపై బైఠాయించారు. వేలాది మంది ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొందరు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. బోగీలు, ఇంజన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దెత్తున చెలరేగాయి. తుని రూరల్ పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. పీఎస్ కు నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. fire-new

888ప్రయాణికులను దింపేసి బోగీలకు నిప్పుపెట్టారు. ముద్రగడకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులపైనా ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో వారు కూడా వెనుదిరిగారు. రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం సాయంత్రం లోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Click on Image to Read:

కాపు గర్జనలో ఉద్రిక్తత- రైళ్లపై రాళ్ల దాడి

kapu-garjana

కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

First Published:  31 Jan 2016 6:53 AM GMT
Next Story