Telugu Global
Others

బాలకృష్ణకు ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

హిందూపురం నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నిస్తున్నప్పటికీ అంచనాలు అందుకోలేకపోతున్నారు. తాజాగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు స్థానిక పారిశ్రామిక సంఘం నేతలు. కార్మికుల సమస్యలను బాలకృష్ణ అస్సలు పట్టించుకోవడం లేదని తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ నిప్పులు చెరిగారు. బాలకృష్ణకు ఓటేసినందుకు తామంతా సిగ్గుపడుతున్నామని మండిపడ్డారు. తూముకుంట పారిశ్రామిక వాడలో మొత్తం 93 ఫ్యాక్టరీలు ఉండగా… యాజమాన్యాలు తరచు కార్మికులపై కేసులు పెట్టిస్తున్నాయన్నది ఆరోపణ. వేతనాలు పెంచాల్సిందిగా […]

బాలకృష్ణకు ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!
X

హిందూపురం నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నిస్తున్నప్పటికీ అంచనాలు అందుకోలేకపోతున్నారు. తాజాగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు స్థానిక పారిశ్రామిక సంఘం నేతలు. కార్మికుల సమస్యలను బాలకృష్ణ అస్సలు పట్టించుకోవడం లేదని తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ నిప్పులు చెరిగారు. బాలకృష్ణకు ఓటేసినందుకు తామంతా సిగ్గుపడుతున్నామని మండిపడ్డారు.

తూముకుంట పారిశ్రామిక వాడలో మొత్తం 93 ఫ్యాక్టరీలు ఉండగా… యాజమాన్యాలు తరచు కార్మికులపై కేసులు పెట్టిస్తున్నాయన్నది ఆరోపణ. వేతనాలు పెంచాల్సిందిగా కోరినందుకు 11మంది కార్మికులపై తాజాగా కేసులు పెట్టించారు. వీరు బాలకృష్ణ దృష్టికి విషయం తీసుకెళ్లినా పట్టించుకోలేదట. దీంతో కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కార్మికుల సమస్యలపై స్పందించకపోవడం ఏమిటని ఓపీడీఆర్ సంఘం నేతలు రవికుమార్, శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాలకృష్ణపై ఎవరూ నేరుగా ఈ స్థాయిలో విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అయితే బాలయ్య పీఏపై మాత్రం చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన దెబ్బకు కొందరు టీడీపీ నేతలు రాజీనామాలు కూడా చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు.

Click on image to read:

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

kaapu-garjana-sabha

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

jana-reddy-lunch

First Published:  30 Jan 2016 3:57 AM GMT
Next Story