Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ కు ముందే వెంకీకి కలిసొచ్చిన నయనతార

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను మే నెల మొదటి వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. దానికి తగ్గట్టే షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా యూనిట్ కు నయనతార కలిసొచ్చింది. తమిళ్ లో చేస్తున్న […]

రిలీజ్ కు ముందే వెంకీకి కలిసొచ్చిన నయనతార
X
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను మే నెల మొదటి వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. దానికి తగ్గట్టే షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా యూనిట్ కు నయనతార కలిసొచ్చింది. తమిళ్ లో చేస్తున్న 2 ప్రాజెక్టులు కొలిక్కి రావడంతో… వెంకీ సినిమాకు ఒకేసారి కాల్షీట్లు కేటాయించింది నయనతార. ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ కు వస్తానని చెప్పేసింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన సినిమా యూనిట్…. షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఇక వెంకీ నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటూనే ఉంటుంది. కాబట్టి… మే రెండో వారంలో అనుకున్న సినిమాను ఏప్రిల్ రెండో వారం లోనే… అంటే నెల రోజుల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
First Published:  29 Jan 2016 11:15 PM GMT
Next Story