Telugu Global
Others

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత కుట్ర ఉందా?!

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హరికృష్ణ వైసీపీలో చేరిపోతారని. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్త ఒక పద్దతి ప్రకారం ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై హరికృష్ణ వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కావాలనే ఈ పుకారు సృష్టించారని మండిపడుతున్నారు. అయినా ఇలాంటి ప్రచారం జరిగితే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తే వారు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు. రెండు మూడు కార్యక్రమాల్లో హరికృష్ణ, జగన్ కలిసిన మాట వాస్తవమేనని అంతమాత్రాన […]

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత కుట్ర ఉందా?!
X

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హరికృష్ణ వైసీపీలో చేరిపోతారని. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్త ఒక పద్దతి ప్రకారం ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై హరికృష్ణ వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కావాలనే ఈ పుకారు సృష్టించారని మండిపడుతున్నారు. అయినా ఇలాంటి ప్రచారం జరిగితే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తే వారు కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు. రెండు మూడు కార్యక్రమాల్లో హరికృష్ణ, జగన్ కలిసిన మాట వాస్తవమేనని అంతమాత్రాన వైసీపీలో హరికృష్ణ ఎందుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు.

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంటే గిట్టని వారే ఈ పీలర్ వదిలారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాలం తమది కాదన్న ఉద్దేశంతో హరికృష్ణ, ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారు. కాలం కలిసొస్తే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నతస్థాయికి వెళ్తారని ఆయన అభిమానులు లెక్కలేస్తున్నారు. ఈ విషయం అర్థమయ్యే టీడీపీలో ఒక వర్గం వారు హరి, ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టేందుకు ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్‌తో హరికృష్ణ సన్నిహితంగా ఉన్నారన్న ప్రచారం విస్రృతంగా జరిగితే టీడీపీని అభిమానించే వారంతా జూనియర్ ఎన్టీఆర్‌ను ధ్వేషిస్తారు, అప్పుడు భవిష్యత్తులో టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాన్ని ఎన్టీఆర్ కోల్పోతారన్న ఉద్దేశంతోనే కొందరు హరి వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

అంటే జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు అందుకోకుండా ఉండేందుకు, టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించే జగన్‌తో హరికృష్ణకు లింకులు కలుపుతున్నారన్న మాట. అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా!.

Click on image to read:

భలే వాడేశావ్ బాస్‌..!

కాపు గర్జణ- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం

kapu-garjana

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

kaapu-garjana-sabha

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

jana-reddy-lunch

బిత్తరపోయిన బీజేపీ నేతలు

First Published:  30 Jan 2016 1:04 AM GMT
Next Story