Telugu Global
Cinema & Entertainment

సరైనోడు లో బన్నీ రోల్ అదే...

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న సినిమా సరైనోడు. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పాత్రపై మొన్నటి వరకు సస్పెన్స్ కొనసాగేది. కొందరు పోలీస్ ఆఫీసర్ అంటే… మరికొందరు కాదంటారు. ఎట్టకేలకు ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా…. బన్నీ క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. సినిమాలో బన్నీ ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వ్యక్తిగా కనిపిస్తాడట. అయితే సినిమా మొత్తం అదే గెటప్ మెయింటైన్ చేయకుండా కాస్త లైవ్లీగా కనిపిస్తాడని తెలుస్తోంది. […]

సరైనోడు లో బన్నీ రోల్ అదే...
X
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న సినిమా సరైనోడు. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పాత్రపై మొన్నటి వరకు సస్పెన్స్ కొనసాగేది. కొందరు పోలీస్ ఆఫీసర్ అంటే… మరికొందరు కాదంటారు. ఎట్టకేలకు ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా…. బన్నీ క్యారెక్టర్ కూడా తెలిసిపోయింది. సినిమాలో బన్నీ ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వ్యక్తిగా కనిపిస్తాడట. అయితే సినిమా మొత్తం అదే గెటప్ మెయింటైన్ చేయకుండా కాస్త లైవ్లీగా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు… ఈ గెటప్ కూడా కేవలం కథలో భాగంగా వేసిందే తప్ప…. సిసలైన గెటప్ మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ కు వచ్చేసరికి బన్నీలో అసలైన గెటప్ ఏంటనేది బయటపడుతుందని చెబుతున్నారు. సో…. తాజా సమాచారం ప్రకారం… సరైనోడు సినిమాలో ఫస్టాఫ్ అంతా భద్రతా అధికారిగా కనిపించే బన్నీ… సెకెండాఫ్ లో మాత్రం మరో డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల్ని వచ్చేనెల 14న విడుదల చేస్తారు. సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయాలని నిర్ణయించారు.
Click on Image to Read:
మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
కూర్చుని… చర్చించుకొని…. పరిష్కరించుకున్నారు
పవన్ సినిమాకు బీప్ మ్యూజిక్ డైరెక్టర్
 కంచెకు సీక్వెల్ గా రాయబారి ?
First Published:  26 Jan 2016 7:02 PM GMT
Next Story