Telugu Global
Others

సిగ్గు సిగ్గు... వెలుగులోకి మరో "పద్మ" విన్యాసం

దేశంలో అత్యంత గౌరవపదమైన పద్మ అవార్డుల ఖ్యాతిని మన వాళ్లు దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ఆరు పద్మ అవార్డుల్లో ఐదు ఒకే కులాని(కమ్మ)కి దక్కడంపై విమర్శలు వస్తున్న వేళ బాలీవుడ్ సెలబ్రిటీ అనుపమ్ ఖేర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పద్మ అవార్డుల విషయంలో అనుపమ్ ఖేర్ ఊసరవెల్లితనంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మోదీ బ్యాచ్‌కు సన్నిహితుడిగా పేరున్న అనుపమ్ ఖేర్ పద్మ అవార్డుల గురించి 2010 ఒక ట్విట్ పెట్టారు. పద్మ అవార్డులు పూర్తిగా రాజకీయం అయిపోయాయని… […]

సిగ్గు సిగ్గు... వెలుగులోకి మరో పద్మ విన్యాసం
X

దేశంలో అత్యంత గౌరవపదమైన పద్మ అవార్డుల ఖ్యాతిని మన వాళ్లు దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ఆరు పద్మ అవార్డుల్లో ఐదు ఒకే కులాని(కమ్మ)కి దక్కడంపై విమర్శలు వస్తున్న వేళ బాలీవుడ్ సెలబ్రిటీ అనుపమ్ ఖేర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పద్మ అవార్డుల విషయంలో అనుపమ్ ఖేర్ ఊసరవెల్లితనంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మోదీ బ్యాచ్‌కు సన్నిహితుడిగా పేరున్న అనుపమ్ ఖేర్ పద్మ అవార్డుల గురించి 2010 ఒక ట్విట్ పెట్టారు. పద్మ అవార్డులు పూర్తిగా రాజకీయం అయిపోయాయని… అసలు ఆ అవార్డులకు అర్థమే లేదని నిప్పులు చెరిగారు. అనుపమ్‌ ట్వీట్‌కు అనుకూలంగా అప్పట్లో నెటిజన్లు పెద్దెత్తున మద్దతు తెలిపారు. అక్కడితో కట్ చేస్తే…

anupam2016 వచ్చింది. అనుపమ్ ఖేర్‌కు కూడా పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. 2010లో పద్మ అవార్డులకు అర్థం లేదు… అవి రాజకీయమయం అయిపోయానని గగ్గోలు పెట్టిన అనుపమ్ అదే ట్విట్టర్ అకౌంట్‌లో కొత్తగా ట్వీట్ చేశారు. ఈసారి పద్మ అవార్డులు చాలా గొప్పవని కోతలు కోశారు. పద్మ అవార్డు రావడం అత్యంత గౌరవప్రదం అంటూ ఊసరవెల్లిలే సిగ్గుపడేలా ట్వీట్ పెట్టారు. ఇక్కడే నెటిజన్లకు మండింది. 2010లో అనుపమ్ ఖేర్ ట్వీట్‌ను బయటకు తీసి దుమ్ముదులుపుతున్నారు. అదీ గౌరవప్రదమైన పద్మ అవార్డులు అందుకున్న మన గొప్పోళ్ల దిక్కుమాలిన బుద్ధి.

Click on Image to Read:

rayapati chandrababu naidu

తాడిపత్రిని లిమ్కాబుక్‌లోకి ఎక్కించిన జేసీ

ఇందుకే జగన్ సీఎం కాలేకపోయాడు!

సిగ్గు సిగ్గు… వెలుగులోకి మరో ”పద్మ” విన్యాసం

అంతొద్దు- బాబు సర్కార్‌ను దెబ్బకొట్టిన కేంద్రం

లీగల్‌ నోటీస్‌ – రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరం

వైఎస్‌ రాజారెడ్డి హంతకుల విడుదల దేనికి సంకేతం?

వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా

First Published:  27 Jan 2016 1:03 AM GMT
Next Story