Telugu Global
Others

ఈ దీపానికి కాసింత ఆముదం కావలెను

ఏపీ ప్రభుత్వం ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆచరణలో చూపుతున్నట్టు కనిపించడం లేదు. అమరావతి శంకుస్థాపన నాడు పవిత్ర జలాలు, పవిత్ర మట్టి, అఖండ జ్యోతి అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి సంగతి మరచిపోయింది. రాజధాని నిర్మాణం సగం పూర్తయ్యే వరకు ఆరనివ్వబోమంటూ గతేడాది అక్టోబర్‌లో అఖండ జ్యోతిని వెలిగించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడది ఆరిపోయింది. నూనె పోసేవారు లేక.. సరైన చర్యలు లేక దీపం కొండెక్కింది. తొలుత ఈ జ్యోతిని అమరావతిలోని అమరేశ్వరాలయంలో వెలిగించి రాజధాని […]

ఈ దీపానికి కాసింత ఆముదం కావలెను
X

ఏపీ ప్రభుత్వం ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆచరణలో చూపుతున్నట్టు కనిపించడం లేదు. అమరావతి శంకుస్థాపన నాడు పవిత్ర జలాలు, పవిత్ర మట్టి, అఖండ జ్యోతి అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటి సంగతి మరచిపోయింది. రాజధాని నిర్మాణం సగం పూర్తయ్యే వరకు ఆరనివ్వబోమంటూ గతేడాది అక్టోబర్‌లో అఖండ జ్యోతిని వెలిగించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడది ఆరిపోయింది. నూనె పోసేవారు లేక.. సరైన చర్యలు లేక దీపం కొండెక్కింది. తొలుత ఈ జ్యోతిని అమరావతిలోని అమరేశ్వరాలయంలో వెలిగించి రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే అక్కడ జ్యోతి నిర్వాహణ చేయలేక తిరిగి దాన్ని అమరేశ్వరాలయానికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడది ఆరిపోయింది. సరైన నిర్వాహణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఇలాంటి పవిత్ర జ్యోతి విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  27 Jan 2016 6:53 AM GMT
Next Story