Telugu Global
Cinema & Entertainment

నిజంగా వీడు సరైనోడు

వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలిస్తే మరో విజయం గ్యారెంటీ అనే మాట అందరి నోటా వినిపిస్తోంది. ఆ మాటకు మరింత బలాన్నిస్తూ విడుదలైంది సరైనోడు ఫస్ట్ లుక్. ఒకేఒక్క పోస్టర్ తో సినిమా ఏ విభాగానికి చెందుతుందో చెప్పకనే చెప్పేశారు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు రాబోతున్నాడు. సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ…. బన్నీ ఫైట్లు మాత్రం ఇందులో బ్రహ్మాండంగా ఉండబోతున్నాయనే విషయాన్ని ఫస్ట్ లుక్ చెప్పేసింది. మరీ ముఖ్యంగా […]

నిజంగా వీడు సరైనోడు
X
వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలిస్తే మరో విజయం గ్యారెంటీ అనే మాట అందరి నోటా వినిపిస్తోంది. ఆ మాటకు మరింత బలాన్నిస్తూ విడుదలైంది సరైనోడు ఫస్ట్ లుక్. ఒకేఒక్క పోస్టర్ తో సినిమా ఏ విభాగానికి చెందుతుందో చెప్పకనే చెప్పేశారు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు రాబోతున్నాడు. సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ…. బన్నీ ఫైట్లు మాత్రం ఇందులో బ్రహ్మాండంగా ఉండబోతున్నాయనే విషయాన్ని ఫస్ట్ లుక్ చెప్పేసింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కథలు ఎంచుకుంటున్న తీరును అంతా మెచ్చుకుంటున్నారు. రేసు గుర్రం లాంటి మాస్ ఎంటర్ టైనర్ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి లాంటి క్లాస్ మూవీ చేశాడు బన్నీ. ఆ సినిమాలో కనిపించినంత సాఫ్ట్ గా బన్నీ మరే మూవీలో కనిపించలేదు. అంతటి సాఫ్ట్ మూవీ తర్వాత సరైనోడు లాంటి మాస్ మూవీలో రఫ్ గా కనిపించబోతున్నాడు. మీసకట్టు కూడా మార్చాడు. ఇలా కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్న బన్నీ…. సరైనోడుతో కచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు.
Click on Image to Read:
నేను అర్హుడ్ని కాదు… కానీ…
సినీ రంగంలో అవార్డులు వీళ్ల‌కే…
మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
మంచు తుఫానులో కలెక్షన్ల సునామీ
మొన్న మహేష్…. నిన్న బాలయ్య… రేపు రామ్ చరణ్
రామ్ చరణ్ కు రీమేకుల పిచ్చి
”బాహుబలి” ఒక స్టుపిడ్‌ మూవీ- అలనాటి నటి నిప్పులు
First Published:  25 Jan 2016 7:03 PM GMT
Next Story