Telugu Global
Cinema & Entertainment

నేను అర్హుడ్ని కాదు... కానీ...

ఎవరూ ఊహించని విధంగా రాజమౌళికి పద్మ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం జక్కన్నకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వార్త విన్న వెంటనే రాజమౌళి స్పందించాడు. తను పద్మ అవార్డుకు అర్హుడ్ని కాదన్నాడు రాజమౌళి. ఓవైపు రామోజీరావు, రజనీకాంత్ లాంటి దిగ్గజాలు పద్మవిభూషణ్ అందుకున్న వేళ…. వాళ్లతో కలిసి పద్మశ్రీ అవార్డును స్వీకరించేంత గొప్పోడ్ని కాదన్నాడు రాజమౌళి. రామోజీరావు, రజనీ …. వాళ్ల వాళ్ల రంగాల్లో చేసిన సేవలు చిరకాలం గుర్తుండి పోతాయని… తాను మాత్రం ఇంకా అలాంటి […]

నేను అర్హుడ్ని కాదు... కానీ...
X
ఎవరూ ఊహించని విధంగా రాజమౌళికి పద్మ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం జక్కన్నకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వార్త విన్న వెంటనే రాజమౌళి స్పందించాడు. తను పద్మ అవార్డుకు అర్హుడ్ని కాదన్నాడు రాజమౌళి. ఓవైపు రామోజీరావు, రజనీకాంత్ లాంటి దిగ్గజాలు పద్మవిభూషణ్ అందుకున్న వేళ…. వాళ్లతో కలిసి పద్మశ్రీ అవార్డును స్వీకరించేంత గొప్పోడ్ని కాదన్నాడు రాజమౌళి. రామోజీరావు, రజనీ …. వాళ్ల వాళ్ల రంగాల్లో చేసిన సేవలు చిరకాలం గుర్తుండి పోతాయని… తాను మాత్రం ఇంకా అలాంటి ముద్రను వేయలేదని చెప్పుకొచ్చాడు. వెండితెరపై ఆణిముత్యం అనదగ్గ చిత్రాన్ని ఇప్పటివరకు తీయలేదని ప్రకటించిన రాజమౌళి…. తన కష్టానికి గుర్తింపుగా ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని కచ్చితంగా అందుకుంటానని ప్రకటించాడు. ఈ అవార్డు తనకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందన్న రాజమౌళి…. అవార్డు వచ్చిన గర్వాన్ని మాత్రం ఎక్కడా చూపించనని అంటున్నాడు.
Click on Image to Read:
సినీ రంగంలో అవార్డులు వీళ్ల‌కే…
మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
మంచు తుఫానులో కలెక్షన్ల సునామీ
మొన్న మహేష్…. నిన్న బాలయ్య… రేపు రామ్ చరణ్
రామ్ చరణ్ కు రీమేకుల పిచ్చి
”బాహుబలి” ఒక స్టుపిడ్‌ మూవీ- అలనాటి నటి నిప్పులు
First Published:  25 Jan 2016 7:02 PM GMT
Next Story