Telugu Global
NEWS

కేటీఆర్‌ తాతనూ వదలని లోకేష్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత లోకేష్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై నేరుగా విరుచుకుపడుతున్నారు. సోమవారం గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన… హైదరాబాద్ అభివృద్ధిని పదేపదే ప్రస్తావించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించి ”హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?. మీ తాతలు అభివృద్ధి చేశారా?. మీ నాన్న అభివృద్ధి చేశారా? చెప్పండి” అని నిలదీశారు. హైదరాబాద్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులకే దక్కుతుందన్నారు. దీన్ని కాదనే మనిషి ఎవరైనా ఉన్నారా […]

కేటీఆర్‌ తాతనూ వదలని లోకేష్
X

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత లోకేష్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై నేరుగా విరుచుకుపడుతున్నారు. సోమవారం గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన… హైదరాబాద్ అభివృద్ధిని పదేపదే ప్రస్తావించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించి ”హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?. మీ తాతలు అభివృద్ధి చేశారా?. మీ నాన్న అభివృద్ధి చేశారా? చెప్పండి” అని నిలదీశారు.

హైదరాబాద్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులకే దక్కుతుందన్నారు. దీన్ని కాదనే మనిషి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు లోకేష్ . హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెప్పడం మాని… తొలుత హైదరాబాద్‌లో చెత్త లేకుండా చేయండి అని అన్నారు. తాము ప్రపంచంలోని అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిస్తే టీఆర్‌ఎస్ మాత్రం వారిని వెళ్లగొట్టే పనిలో ఉందని లోకేష్ విమర్శించారు. చంద్రబాబు ఫోన్ చేసి చెప్పడం వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి అదనంగా మరో 50 వేల ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. 100 సీట్లు గెలుస్తామన్న కేటీఆర్‌ సవాల్‌కు టైగర్ రేవంత్ రెడ్డి ప్రతిసవాల్ విసరడంతో కేటీఆర్‌ తోకముడిచారని ఎద్దేవా చేశారు లోకేష్ .

Click on Image to Read:

టీడీపీ కొంప ముంచుతోన్న పాట‌!

అందుకే చేతగాని వాడిలా బతుకుతున్నా..!

రెడ్ల గొప్పదనం వివరించిన జేసీ

మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

kodela-shiva-prasad

vangaveeti-radha

jayasudha

lokesh

First Published:  25 Jan 2016 8:52 PM GMT
Next Story