Telugu Global
Cinema & Entertainment

కమ్ముల జీవితంలో హ్యాపీడేస్

హ్యాపీ డేస్ సినిమాను హిందీలో తీస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నాడు శేఖర్ కమ్ముల. అది ఇన్నాళ్లకు సాధ్యపడింది. మార్చి నుంచి హిందీ హ్యాపీడేస్ ను పట్టాలపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు కమ్ముల. దీనికి సంబంధించి నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. షూటింగ్ కోసం పూణెలోని ఓ కళాశాలను కూడా సెలక్ట్ చేసుకున్నాడు. మార్చి నుంచి ఏకథాటిగా సినిమాను తీసి…. ఏడాది చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తో కలిసి నిర్మించనున్నాడు కమ్ముల. మరోవైపు కథా […]

కమ్ముల జీవితంలో హ్యాపీడేస్
X
హ్యాపీ డేస్ సినిమాను హిందీలో తీస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నాడు శేఖర్ కమ్ముల. అది ఇన్నాళ్లకు సాధ్యపడింది. మార్చి నుంచి హిందీ హ్యాపీడేస్ ను పట్టాలపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు కమ్ముల. దీనికి సంబంధించి నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. షూటింగ్ కోసం పూణెలోని ఓ కళాశాలను కూడా సెలక్ట్ చేసుకున్నాడు. మార్చి నుంచి ఏకథాటిగా సినిమాను తీసి…. ఏడాది చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తో కలిసి నిర్మించనున్నాడు కమ్ముల. మరోవైపు కథా పరంగా ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించాడు. తెలుగులో హ్యాపీడేస్ ఎలా ఉంటుందో…. యాజ్ ఇటీజ్ గా హిందీలో కూడా అలానే ఉంటుందని ప్రకటించాడు. త్వరలోనే తన రీమేక్ సినిమాకు సంబంధించి ఓ టీజర్ ను కూడా విడుదల చేస్తానంటున్నాడు కమ్ముల. మొత్తానికి అనామిక తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కమ్ముల…. మళ్లీ ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టుకోబోతున్నాడన్నమాట.
First Published:  25 Jan 2016 7:04 PM GMT
Next Story