Telugu Global
Others

రోజాపై పరోక్షంగా జయసుధ హాట్ కామెంట్స్

కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, సహజనటి జయసుధ తన రాజకీయ తీరుతెన్నులపై స్పందించారు. రోజాకు కౌంటర్‌గానే జయసుధను టీడీపీ తీసుకొచ్చిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రోజాను దూషించకుండానే పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోజాకు కౌంటర్‌గా తనను టీడీపీలో చేర్చుకున్నారనడం పెద్ద జోక్ అన్నారామె. రోజాతో తనకు పోలికే లేదన్నారు. ఏ విధంగానూ తనతో రోజాను పోల్చలేరన్నారు. అలాంటి మహిళ(రోజా)గా ఉండేందుకు తాను ఇష్టపడనని చెప్పారు. తన పద్దతి తనదన్నారు. సినిమాల్లో కంటే […]

రోజాపై పరోక్షంగా జయసుధ హాట్ కామెంట్స్
X

కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, సహజనటి జయసుధ తన రాజకీయ తీరుతెన్నులపై స్పందించారు. రోజాకు కౌంటర్‌గానే జయసుధను టీడీపీ తీసుకొచ్చిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రోజాను దూషించకుండానే పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోజాకు కౌంటర్‌గా తనను టీడీపీలో చేర్చుకున్నారనడం పెద్ద జోక్ అన్నారామె. రోజాతో తనకు పోలికే లేదన్నారు. ఏ విధంగానూ తనతో రోజాను పోల్చలేరన్నారు. అలాంటి మహిళ(రోజా)గా ఉండేందుకు తాను ఇష్టపడనని చెప్పారు. తన పద్దతి తనదన్నారు. సినిమాల్లో కంటే రాజకీయాల్లో పెద్దపెద్ద నటులున్నారన్నారు. వైఎస్ అండతోనే రాజకీయాల్లోకి వచ్చానని జయసుధ చెప్పారు. టీడీపీతో తొలి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు. దర్శకనిర్మాతలు కేసీఆర్‌కు బాగా పరిచయస్తులు కావడం వల్లే తన కుమారుడి చిత్రం ఆడియో పంక్షన్‌కు టీసీఎంను ఆహ్వానించామని చెప్పారు.

Click on Image to Read:

kodela-shiva-prasad

vangaveeti-radha

lokesh

balakrishna1

jagan-lokesh

First Published:  24 Jan 2016 11:07 PM GMT
Next Story