Telugu Global
Cinema & Entertainment

సినీ రంగంలో అవార్డులు వీళ్ల‌కే...

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల్లో అనుప‌మ్ ఖేర్  ఒక విశిష్ట‌మైన ఆర్టిస్ట్. 3 ద‌శాబ్దాల‌కు పైగా ఎన్నో వంద‌ల చిత్రాల్లో మెప్పించిన అనుప‌మ్ ఖేర్  రంగ‌స్థ‌లం నుంచి బాలీవుడ్ వెండి తెర‌కు వ‌చ్చిన  ఆణిముత్యాల్లో ఒక‌రు. 1955 మార్చి 7 న జ‌న్మించిన అనుప‌మ్ ఖేర్, 1982 సంవ‌త్స‌రంలో  న‌టుడిగా   ఆగ‌మ‌న్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.  1984 లో వ‌చ్చిన  సారాంష్ చిత్రంతో కెరీర్ ప‌రంగా ఆయ‌న వెన‌క్కు చూసుకోలేదు.   1989 లో వ‌చ్చిన డాడి చిత్రం […]

సినీ రంగంలో అవార్డులు వీళ్ల‌కే...
X

latestబాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల్లో అనుప‌మ్ ఖేర్ ఒక విశిష్ట‌మైన ఆర్టిస్ట్. 3 ద‌శాబ్దాల‌కు పైగా ఎన్నో వంద‌ల చిత్రాల్లో మెప్పించిన అనుప‌మ్ ఖేర్ రంగ‌స్థ‌లం నుంచి బాలీవుడ్ వెండి తెర‌కు వ‌చ్చిన ఆణిముత్యాల్లో ఒక‌రు. 1955 మార్చి 7 న జ‌న్మించిన అనుప‌మ్ ఖేర్, 1982 సంవ‌త్స‌రంలో న‌టుడిగా ఆగ‌మ‌న్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. 1984 లో వ‌చ్చిన సారాంష్ చిత్రంతో కెరీర్ ప‌రంగా ఆయ‌న వెన‌క్కు చూసుకోలేదు. 1989 లో వ‌చ్చిన డాడి చిత్రం మరియు 2005లో వచ్చిన మైనే గాంధీ కో నహీ మారా చిత్రాలలో ఆయ‌న న‌ట‌న‌కు నేష‌న‌ల్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డు అందుకున్నారు.

సుదీర్ఘ‌మైన ఆయ‌న న‌ట జీవితం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2004 లో భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ తో పుర‌స్కారం ఇచ్చి స‌త్క‌రించింది. తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం దేశంలో మూడో అత్యుత్త‌మ పౌర పుర‌స్కారమైన ప‌ద్మ‌భూష‌ణ్ అనుప‌మ్ ఖేర్ ను వ‌రించింది.
—————————————————————————————————————
Rajiniర‌జ‌నీకాంత్. న‌టుడిగా త‌మిళ్ ఇండ‌స్ట్రీ కి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికి.. సినిమా ప‌రంగా ర‌జ‌నీకాంత్ ఒక శక్తి. సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ గా జీవితం ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్ ఆ త‌రువాత ద‌ర్శ‌క దిగ్గ‌జం కే బాలచంద‌ర్ చెక్కిన శిల్పాల్లో ఒక‌రిగా ఎదిగారు. అభిమానుల‌కు ర‌జ‌నీకాంత్ గా ప‌రిచ‌యం అయ్యారు. త‌న‌దైన స్టైల్స్ తో మాస్ ఆడియ‌న్స్‌కు ఒక దేవుడి గా ..నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించే సూప‌ర్ స్టార్ గా ఎమ‌ర్జ్ అయ్యారు. దేవుడు శాసిస్తాడు..అరుణ చ‌లం పాటిస్తాడంటూ కోట్లాది మంది అభిమానుల్ని ప్ర‌పంచ వ్యాప్తంగా సంపాదించుకున్నారు. న‌టుడిగా 40 సంవత్స‌రాల‌కు పైగా ప్ర‌యాణం చేస్తూన్న ర‌జ‌నీకాంత్ .. 65 ఏళ్ల వ‌య‌సులోను ఆయ‌న మీద ప్ర‌స్తుతం 5 వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ లు న‌డుస్తున్నాయంటే ర‌జ‌నీకాంత్ క‌మ‌ర్షియ‌ల్ స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు.

1975 లో అపూర్వ రాగం గళః ( తెలుగులో అంతులేని క‌థ‌) ద‌ర్శ‌కుడు కే బాల‌చంద‌ర్ ప‌రిచ‌యం చేసిన ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అయ్యారు. ఆసియాలో జాకిచాన్ త‌రువాత అత్యంత ఎక్కువ పారితోష‌కం తీసుకునే న‌టుడు ఒన్ అండ్ వ‌న్లీ ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే. ప్ర‌స్తుతం రోబో సీక్వెల్.. క‌బాలీ చిత్రాల‌తో సిద్దం అవుతున్నారు. న‌టుడిగా త‌మిళ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ర‌జ‌నీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న పుర‌స్కారాల్లో రెండ‌వ‌ది అయిన ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల కోట్లాది మంది ఆయ‌న అభిమానుల‌కు పండ‌గలా ఉంది. ఇక ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న క‌బాలీ, రోబో సీక్వెల్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల పెట్టుబ‌డి దాదాపు 4 వంద‌ల కోట్లు వుంటుంద‌ని కోలీవుడ్ మీడియా టాక్.
—————————————————————————————————————
Ajay-Devgan-7-v_thయాక్ష‌న్ చిత్రాలంటే బాలీవుడ్ లో గుర్తొచ్చే పేరులో అజేయ్ దేవ‌గ‌న్ ఒక‌రు. 1991 లో పూల్ ఔర్ కాంటే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. న‌టుడిగా సిల్వ‌ర్ జూబ్లి పూర్తి చేసుకున్న అజేయ్ దేవ‌గ‌న్ హీరోగా వ‌ర్సెటైల్ అనిపించుకున్నారు. హీరోయిన్ కాజోల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు క‌ల‌సి సొంత బ్యాన‌ర్ లో ప‌లు చిత్రాలు చేశారు. నిర్మాత‌గా కూడ అజ‌య్ దేవ‌గ‌న్ పలు చిత్రాలు నిర్మించారు.

తండ్రి వీరు దేవ‌గ‌న్ బాలీవుడ్ లో స్టంట్ మాస్ట‌ర్ గా చేశారు. చిన్న త‌నం నుంచి అజ‌య్ దేవ‌గ‌న్ సినిమా వాతావ‌ర‌ణంలో పెరిగారు. 1998లో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన జ‌ఖ్మ చిత్రానికి నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు అందుకున్నారు. క‌ళా కారుడిగా అజయ్ దేవ‌గ‌న్ అందిస్తున్న సేవ‌ల‌కుగాను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించింది. ఇది అజ‌య్ దేవ‌గ‌న్ అభిమానుల‌కు పండ‌గే మ‌రి.
—————————————————————————————————————
priyanka-chopra_ప్రస్తుతం బాలీవుడ్ లో వున్న న‌టి మ‌ణుల్లో ప్రియాంక చోప్రా వైర్స‌టైల్ అని చెప్పాలి. 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని కైవ‌సం చేసుకున్న ప్రియంక 1982, జూలై 18 న జన్మించారు. 2002 లో హ‌మ్ రాజ్ అనే చిత్రంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. న‌టిగా త‌ను చేసిన ఫ్యాష‌న్ చిత్రానికి నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డు అందుకుంది. ఈ సినిమాతో సూప‌ర్ స్టార్ స్టేట‌స్ ను గెయిన్ చేశారు.

నటిగా వైవిధ్యానికి పెద్ద పీట వేసే ప్రియాంక త‌న ప్ర‌తిభ‌ను హాలీవుడ్ లోకూడా చాటుకున్నారు. పిటుబుల్ చేసిన ఒక ఆల్బ‌మ్ లో న‌టించి హాలీవుడ్ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రైయ్యారు. ఆర్టిస్ట్ గా త‌న సేవ‌ల‌కు ప్ర‌భుత్వం తాజాగా ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ప్ర‌క‌టించడం నిజంగా ఆమే అభిమానుల‌కు ఇది చాలా హ్యాపి మూమెంట్ మ‌రి.
—————————————————————————————————————
ss-rajamouli-baahubali-trailer-release-event ద‌ర్శ‌కుల యందు రాజ‌మౌళి వేర‌య్య అని త‌న మొద‌టి చిత్రం నుంచి టాలీవుడ్ లో స‌గర్వంగా చాటుకుంటున్నాడు. టీవి సీరియ‌ల్స్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన రాజ‌మౌళి.. యువ హీరోల్ని చాల మందిని సూప‌ర్ స్టార్స్ చేశారు.

ఎన్టీఆర్ కు సింహాద్రి, ప్ర‌భాస్ కు చత్ర‌ప‌తి, రాంచ‌ర‌ణ్ కు మ‌గ‌థీర‌, ఈగ చిత్రంతో సాంకేతికంగా త‌ను ప్ర‌తిభ‌.. బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాత‌ని అంత‌ర్జాతీయంగా చాటిన ద‌ర్శ‌క దిగ్గ‌జం. ప్ర‌స్తుతం బాహుబ‌లి సీక్వెల్ ను చేస్తున్న రాజ‌మౌళి కి పద్శ శ్రీ పుర‌స్కారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇది ఆయ‌న పై మ‌రింత బాధ్య‌త‌ను పెంచుతుంది అన‌డంలో సందేహాం లేదు.
—————————————————————————————————————
aeac281665ff288c048c9efe94c5e25f_mఇక సింగ‌ర్స్ లో ఈ సారి ఉదిత్ నారాయ‌ణ్ కు మ‌రోసారి పౌర పుర‌స్కారం వరించింది. జ‌న్మ‌త‌హా నేపాలి అయిన ఉదిత్ నారాయ‌ణ్‌, డిసెంబ‌ర్ 1, 1955 లో జ‌న్మించారు. త‌న తీయ్య‌టి స్వ‌రంతో కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనిపించుకున్నారు. హింది, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌ల‌యాళ‌, బెంగాలీ భాష‌ల్లో పాటలు పాడారు.

1988 లో రిలీజ్ అయిన ఖ‌య‌మ‌త్ సే ఖ‌య‌మ‌త్ త‌క్ చిత్రంలోని పాట‌లు ఉదిత్ కు మంచి పేరు తెచ్చాయి. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఉదిత్ నారాయ‌ణ 2004 లో ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. తాజాగా ఆయ‌న‌కు ప‌ద్శ‌భూష‌ణ్ రావ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ఖుషిగా ఉన్నారు. అవార్డులు అందుకున్న సినిమా దిగ్గ‌జాల‌కు తెలుగు గ్లోబ‌ల్ త‌రుపున అభినంద‌న‌లు .

First Published:  25 Jan 2016 5:01 AM GMT
Next Story