Telugu Global
Cinema & Entertainment

ఆదిత్య 369  సీక్వెల్ సూర్య చేసేస్తున్నాడా..!

సూర్య సినిమాలే వైవిధ్యంగా ఉంటాయనుకుంటే దర్శకుడు విక్రమ్ కుమార్ ఆయనకి జతకలవడం 24 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు కూడా వాటిని పెంచడానికే పరిమితమయ్యాయి. కథ, కథనాలు గురించి 24 టీమ్ అంతా మౌనం వహిస్తున్నారు. తాజాగా దీనిపై ఓ విషయం బయటపడింది. టైమ్ మెషీన్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినవస్తున్న కథనం ప్రకారం హీరో (సూర్య) వాచ్ రిపేర్ షాప్ నడుపుతుంటాడు. ఓ శాస్త్రవేత్త దగ్గర వాచ్ […]

ఆదిత్య 369  సీక్వెల్ సూర్య చేసేస్తున్నాడా..!
X
సూర్య సినిమాలే వైవిధ్యంగా ఉంటాయనుకుంటే దర్శకుడు విక్రమ్ కుమార్ ఆయనకి జతకలవడం 24 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు కూడా వాటిని పెంచడానికే పరిమితమయ్యాయి. కథ, కథనాలు గురించి 24 టీమ్ అంతా మౌనం వహిస్తున్నారు. తాజాగా దీనిపై ఓ విషయం బయటపడింది. టైమ్ మెషీన్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినవస్తున్న కథనం ప్రకారం హీరో (సూర్య) వాచ్ రిపేర్ షాప్ నడుపుతుంటాడు. ఓ శాస్త్రవేత్త దగ్గర వాచ్ కొట్టేసిన దొంగ అది పనిచేయట్లేదంటూ రిపేర్ చేయమని హీరోకి ఇస్తాడు. హీరో దాన్ని రిపేర్ చేసే ప్రాసెస్‌లో అది టైమ్ మెషిన్ అని తెలుసుకుంటాడు. దాంతో భూత, భవిష్యత్ కాలాల మధ్య అతడి ప్రయాణం నడుస్తుందట. చూస్తుంటే.. ఆదిత్య 369 సీక్వెల్ సింగీతం గారికంటే ముందు విక్రమ్ తీస్తున్నట్టు అనిపిస్తోంది. నిజానిజాలేమిటన్నది తెరమీద చూడాల్సిందే.
First Published:  23 Jan 2016 7:04 PM GMT
Next Story