Telugu Global
Cinema & Entertainment

నాన్నకు ప్రేమతో అదనంగా కొన్ని సీన్లు

నాన్నకు ప్రేమతో సినిమా ఎడిటింగ్ స్టేజ్ లో 3 గంటలు వచ్చింది. ఎలాగోలా కష్టపడి మరీ ఆ సినిమాను 2గంటల 45 నిమిషాలకు కుదించారు. అది కూడా ఎక్కువే. కానీ ధైర్యంగా విడుదల చేసి విజయం సాధించారు. సినిమా నిడివి పెద్దగా ఉన్నప్పటికీ…. ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కలెక్షన్ వర్షం కురిపిస్తున్నారు. దీంతో రెట్టించిన నమ్మకంతో… మేకర్స్ మరో సన్నివేశాన్ని జతచేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని నాన్నకు ప్రేమతో సక్సెస్ మీట్ లో స్వయంగా వెల్లడించారు. […]

నాన్నకు ప్రేమతో అదనంగా కొన్ని సీన్లు
X
నాన్నకు ప్రేమతో సినిమా ఎడిటింగ్ స్టేజ్ లో 3 గంటలు వచ్చింది. ఎలాగోలా కష్టపడి మరీ ఆ సినిమాను 2గంటల 45 నిమిషాలకు కుదించారు. అది కూడా ఎక్కువే. కానీ ధైర్యంగా విడుదల చేసి విజయం సాధించారు. సినిమా నిడివి పెద్దగా ఉన్నప్పటికీ…. ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కలెక్షన్ వర్షం కురిపిస్తున్నారు. దీంతో రెట్టించిన నమ్మకంతో… మేకర్స్ మరో సన్నివేశాన్ని జతచేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని నాన్నకు ప్రేమతో సక్సెస్ మీట్ లో స్వయంగా వెల్లడించారు. తాజాగా యాడ్ చేసిన సన్నివేశంతో సినిమా నిడివి దాదాపు 3 గంటలకు చేరుకుంటుంది. అయినప్పటికీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నారు. అదనంగా జతచేసిన సన్నివేశం ఈరోజు నుంచే థియేటర్లలో ప్రసారం అవుతుంది. ఆ సన్నివేశం క్లైమాక్స్ కు ముందు వస్తుందట. తాజా సన్నివేశంతో వసూళ్లు మరింత పెరుగుతాయని సుకుమార్ టీం అంచనా వేస్తోంది.
First Published:  22 Jan 2016 7:07 PM GMT
Next Story