Telugu Global
NEWS

అగ్నికి ఆజ్యం " హెచ్‌సీయూలో మరో వివాదం

విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు మిన్నంటుతున్న వేళ, విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ వర్శిటీ అధికారులు మరో వివాదానికి తెరలేపారు. నిరసన కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొంటుండడంతో వారిని చెదరగొట్టేందుకు పరోక్ష ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై అధికారులు కన్నేశారు. రాత్రి నుంచి క్యాంపస్‌లో ఇంటర్నెట్‌, వై-పై సేవలను నిలిపివేశారు. ఇంటర్నెట్, వైపై అందుబాటులో లేకుంటే విద్యార్థులు ఆందోళన ప్రాంగణం నుంచి వెళ్లిపోతారన్నది అధికారుల ఆలోచన. ఇప్పటి వరకు క్యాంపస్ నెట్‌వర్క్ […]

అగ్నికి ఆజ్యం  హెచ్‌సీయూలో మరో వివాదం
X

విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు మిన్నంటుతున్న వేళ, విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ వర్శిటీ అధికారులు మరో వివాదానికి తెరలేపారు. నిరసన కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొంటుండడంతో వారిని చెదరగొట్టేందుకు పరోక్ష ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై అధికారులు కన్నేశారు. రాత్రి నుంచి క్యాంపస్‌లో ఇంటర్నెట్‌, వై-పై సేవలను నిలిపివేశారు. ఇంటర్నెట్, వైపై అందుబాటులో లేకుంటే విద్యార్థులు ఆందోళన ప్రాంగణం నుంచి వెళ్లిపోతారన్నది అధికారుల ఆలోచన.

ఇప్పటి వరకు క్యాంపస్ నెట్‌వర్క్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా విద్యార్థులు, సిబ్బందికి వైపై సేవలు అందుతున్నాయి. వైపై అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులు మొబైల్స్‌లో చాటింగ్ చేసుకుంటూ… ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ కాలక్షేపం చే్స్తున్నారని అధికారుల భావన. కాబట్టి వైపై కట్ చేస్తే విద్యార్థులు చెదిరిపోతారన్నది అధికారుల అతితెలివి ఆలోచన. ఉన్నతాధికారుల తీరుపై విద్యార్థులతో పాటు అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న విద్యార్థులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏ తరహా వ్యూహమని మండిపడుతున్నారు.

First Published:  22 Jan 2016 3:18 AM GMT
Next Story