Telugu Global
Others

చుక్కల వైపు అమరావతి

ఏపీ రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన సమయంలో అమరావతి పరిధిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఎకరం పది కోట్ల వరకు వెళ్లింది. అయితే  ఆ తర్వాత అక్కడ రియల్ భూం ఒక్కసారిగా కుప్పకూలింది. రాజధాని పరిధిని మరీ అతిగా ఏకంగా 8 వేల చదరపు కి.మీలు ప్రకటించడంతో భూమి ఎక్కువై ధర తగ్గిపోయింది.  ముందస్తు సమాచారంతో రాజధాని కీలక ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు కూడా అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. ప్రస్తుతం అక్కడున్న భూముల ధరలు చూసిన తర్వాత  సింగపూర్ […]

చుక్కల వైపు అమరావతి
X

ఏపీ రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన సమయంలో అమరావతి పరిధిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఎకరం పది కోట్ల వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత అక్కడ రియల్ భూం ఒక్కసారిగా కుప్పకూలింది. రాజధాని పరిధిని మరీ అతిగా ఏకంగా 8 వేల చదరపు కి.మీలు ప్రకటించడంతో భూమి ఎక్కువై ధర తగ్గిపోయింది. ముందస్తు సమాచారంతో రాజధాని కీలక ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు కూడా అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. ప్రస్తుతం అక్కడున్న భూముల ధరలు చూసిన తర్వాత సింగపూర్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సంశయిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భూముల ధరలను మళ్లీ ఆకాశం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అద్భుత ఆలోచన చేసింది. రాజధాని విస్తీర్ణం మరీ ఎక్కువైపోవడం వల్లే భూముల ధరలు తగ్గిపోయాయన్న ఉద్దేశంతో కొత్త ఎత్తు వేసింది. రాజధాని పరిధి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని దాదాపు 50 మండలాలను అగ్రిజోన్లుగా ప్రకటించారు. అంటే ప్రభుత్వం అగ్రిజోన్లుగా ప్రకటించిన మండలాల్లో మరో 35 సంవత్సరాల పాటు వ్యవసాయం మినహా మరే కార్యక్రమాలు చేయకూడదు. రియల్ వ్యాపారం అస్సలు చేయకూడదు.

ప్రభుత్వం ఇలా చేయడానికి అసలు కారణం తాము అనుకున్న ప్రాంతంలో రియల్ ధరలు పెంచేలా చేయడమే. రాజధాని కీలక ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలను అగ్రిజోన్లు చేయడం వల్ల ఇళ్ల స్థలాలు కొనాలనుకునే వారు చచ్చినట్టు ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే భూమి విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరిగి భూముల ధరలు ఆటోమెటిక్‌గా పెరిగిపోతాయి. దీని వల్ల ముందస్తుగా కోర్‌ క్యాపిటల్ పక్కనే భూములు కొన్న బడానేతలతో పాటు సింగపూర్ కంపెనీలకు సిరులు కురుస్తాయి. అంటే రాజధాని ప్రాంతంలో కేవలం ధనికులు మాత్రమే స్థలాలు కొనే పరిస్థితిని ప్రభుత్వం నేరుగానే సృష్టిస్తోంది. సో త్వరలోనే అమరావతిలో భూముల ధరలు మరోసారి కృత్తిమ రెక్కలు తొడిగి ఆకాశం వెపు పరుగులు తీయనున్నాయి.

First Published:  21 Jan 2016 9:37 PM GMT
Next Story