విమానానికి పారాచూట్- కూలినా ఏమికాదు!(video)
విమానం. గాల్లో ఎగిరిన తర్వాత ఇంజన్ ఫెయిల్ అయినా జరగకూడనిది జరిగినా ప్రాణాలు గాల్లోనే కలిసిపోవడం ఖాయం. అయితే దీనికి కూడా పరిష్కారం కనుగొనే విషయంలో పరిశోధకులు ఒక అడుగు ముందుకేశారు. గాల్లో ఇంజన్ ఫెయిల్ అయినా ముప్పు లేకుండా ప్రయాణికుల క్యాబిన్ కిందకు దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు పారాచూట్‌లను వాడుకునే ఆలోచన చేస్తున్నారు. విమానానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడిన సమయంలో ప్రయాణికుల క్యాబిన్… కాక్‌పిట్ నుంచి విడిపోతుంది. అది కిందకు పడే సమయంలోనే పారాచూట్లు […]
విమానం. గాల్లో ఎగిరిన తర్వాత ఇంజన్ ఫెయిల్ అయినా జరగకూడనిది జరిగినా ప్రాణాలు గాల్లోనే కలిసిపోవడం ఖాయం. అయితే దీనికి కూడా పరిష్కారం కనుగొనే విషయంలో పరిశోధకులు ఒక అడుగు ముందుకేశారు. గాల్లో ఇంజన్ ఫెయిల్ అయినా ముప్పు లేకుండా ప్రయాణికుల క్యాబిన్ కిందకు దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు పారాచూట్‌లను వాడుకునే ఆలోచన చేస్తున్నారు. విమానానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడిన సమయంలో ప్రయాణికుల క్యాబిన్… కాక్‌పిట్ నుంచి విడిపోతుంది. అది కిందకు పడే సమయంలోనే పారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో ప్రయాణికుల క్యాబిన్ మెల్లగా భూమి మీదకు చేరుతుంది.
అలా పడ్డప్పుడు ఎలాంటి ప్రమాదం లేకుండా క్యాబిన్ అడుగుభాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఏ సముద్రంలోనైనా కూలితే అనుకోవద్దు… నీటిలో కూడా క్యాబిన్ తేలేలా రబ్బర్ ట్యూబ్లను క్యాబిన్ అడుగు భాగంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల విమాన ప్రమాదాల్లో ప్రాణనష్టం చాలా వరకు నివారించవచ్చని ఈ నమూనా తయారు చేసిన ఇంజనీర్లు చెబుతున్నారు. అన్నట్టు ఈ నమూనాను సిద్ధం చేసింది రష్యాకు చెందిన నికోలావెట్ అనే ఇంజనీర్. అయితే ప్రమాదం సమయంలో ప్రయాణికుల క్యాబిన్‌ను పారాచూట్లు రక్షిస్తా సరే… మరి కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ల సంగతేంటన్నదే ఇప్పుడు తేలాలి.
https://youtu.be/JeSdj7NC7ZE