Telugu Global
Others

కాల్ మనీ నిందితులకు బెయిల్ దేనికి సంకేతం?

వాళ్లు వడ్డీల పేరుతో వందల మందిని జలగల్లా పీక్కుతిన్నారు. అవసరానికి డబ్బు ఇచ్చి మహిళల మానాలను దోచుకున్నారు. మరికొందర్ని వ్యభిచార రొంపిలోకి దింపారు. చెప్పినట్టు చేయకపోతే చంపేందుకు కూడా వెనుకాడని నరరూప రాక్షసులు. ఇవన్నీ బెజవాడలోని కాల్ మనీ గ్యాంగ్ గురించే. ఏపీలో సంచలనం రేపిన కాల్ మనీ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు యలమంచిలి రాము, దూడల రాజేశ్‌, భవానీ శంకర్‌లకు కోర్టులో బెయిల్‌ లభించింది. నిందితులకు బెయిల్ రావడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం […]

కాల్ మనీ నిందితులకు బెయిల్ దేనికి సంకేతం?
X
వాళ్లు వడ్డీల పేరుతో వందల మందిని జలగల్లా పీక్కుతిన్నారు. అవసరానికి డబ్బు ఇచ్చి మహిళల మానాలను దోచుకున్నారు. మరికొందర్ని వ్యభిచార రొంపిలోకి దింపారు. చెప్పినట్టు చేయకపోతే చంపేందుకు కూడా వెనుకాడని నరరూప రాక్షసులు. ఇవన్నీ బెజవాడలోని కాల్ మనీ గ్యాంగ్ గురించే. ఏపీలో సంచలనం రేపిన కాల్ మనీ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు యలమంచిలి రాము, దూడల రాజేశ్‌, భవానీ శంకర్‌లకు కోర్టులో బెయిల్‌ లభించింది. నిందితులకు బెయిల్ రావడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టైన ఐదుగురిలో ముగ్గురికి బెయిల్ రావడం ఈ కేసులో సంచలనంగా మారింది.
మరోవైపు ఇదివరకే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సత్యానందం కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ముగ్గురు కీలక నిందితులకు బెయిల్ వచ్చింది. వీటన్నింటికి కారణం పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ సరైన వాదనలు వినిపించలేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. నిందితులపై నిర్భయ చట్టం క్రింద కేసు కూడా నమోదైంది. అయినా ఇంత సులువుగా బెయిల్ రావడానికి కేవలం ప్రాసిక్యూషన్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు. కాలమనీ కేసు దర్యాప్తు నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్‌ మనీ కేసులో అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు ఉండడం కూడా ఓ కారణమంటున్నారు. వీరందరికీ ఆర్థిక, రాజకీయ అండదండలు ఉన్నాయని.. వారి జోలికి పోలీసులు వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
First Published:  19 Jan 2016 7:04 PM GMT
Next Story