Telugu Global
Others

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌పై దాడి (ఫొటోలు)

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీకెట్లు దక్కని టీడీపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్బర్‌బాగ్ డివిజన్‌ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్‌ రెడ్డి ఏకంగా అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌పై దాడి చేశారు. టీడీపీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. బ్యానర్లు చించివేశారు. 15 నిమిషాల పాటు రచ్చరచ్చ చేశారు. దాదాపు అన్ని బ్యానర్లను చించిపడేశారు. ఇంతలో టీడీపీ నాయకులు బయటకు రాగా వారితో శ్రీకాంత్ రెడ్డి ఆయన అనుచరులు […]

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌పై దాడి (ఫొటోలు)
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీకెట్లు దక్కని టీడీపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్బర్‌బాగ్ డివిజన్‌ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్‌ రెడ్డి ఏకంగా అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌పై దాడి చేశారు. టీడీపీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. బ్యానర్లు చించివేశారు. 15 నిమిషాల పాటు రచ్చరచ్చ చేశారు. దాదాపు అన్ని బ్యానర్లను చించిపడేశారు. ఇంతలో టీడీపీ నాయకులు బయటకు రాగా వారితో శ్రీకాంత్ రెడ్డి ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పనికి రారంటూ తనను అవమానించారని ఆయన ఆవేదన చెందారు. 30 లక్షలు ఇస్తే టికెట్ ఇస్తామంటూ పార్టీ ఇన్‌చార్జ్ డిమాండ్ చేశారని ఆరోపించారు. తమలాంటి వారు రూ. 30 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక దశలో శ్రీకాంత్ వర్గీయులు, టీడీపీ నేతలు బాహాబాహాకి సిద్ధమయ్యారు. ఇంతలో సీనియర్ నేతలు వచ్చి సద్దిచెప్పడంతో శ్రీకాంత్ రెడ్డి వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

saksh2sakshi-3sakshi-5sakshi-6

Click on Image to Read:

ghattamaneni-adi-seshagiri-rao

First Published:  20 Jan 2016 9:10 AM GMT
Next Story