వాళ్లిద్దరి మధ్య గొడవ ఉత్తిదే
పూరీ జగన్నాధ్, చార్మి విడిపోయారంటూ ఆ మధ్య తెగ వార్తలొచ్చాయి. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత పూరి జగన్ కు, చార్మికి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయని…. వాళ్లిద్దరూ ప్రస్తుతం ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారంటూ మీడియా కోడై కూసింది. కానీ పూరి-చార్మి ఇప్పటికీ కలిసే ఉన్నారు. వాళ్ల మధ్య సంబంధాలు అలానే కొనసాగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈమధ్య తరచుగా పూరి జగన్నాధ్ ఆఫీస్ కు చార్మి వస్తోందట. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకు కూడా వెళ్తున్నారట. సరదాగా […]
BY sarvi19 Jan 2016 7:05 PM GMT
X
sarvi Updated On: 20 Jan 2016 12:59 AM GMT
పూరీ జగన్నాధ్, చార్మి విడిపోయారంటూ ఆ మధ్య తెగ వార్తలొచ్చాయి. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత పూరి జగన్ కు, చార్మికి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయని…. వాళ్లిద్దరూ ప్రస్తుతం ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారంటూ మీడియా కోడై కూసింది. కానీ పూరి-చార్మి ఇప్పటికీ కలిసే ఉన్నారు. వాళ్ల మధ్య సంబంధాలు అలానే కొనసాగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈమధ్య తరచుగా పూరి జగన్నాధ్ ఆఫీస్ కు చార్మి వస్తోందట. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకు కూడా వెళ్తున్నారట. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు కూడా వేసుకుంటున్నారట. దాదాపు పాతికమందికి పైగా స్టాఫ్ ను పీకేసిన పూరి జగన్నాధ్… ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కొత్త కుర్రాళ్లను తీసుకునే పనిలో పడ్డాడు. ఈ గ్యాప్ లో పూరికి టైమ్ పాస్ అందించడానికి, చార్మి ప్రిపేర్ అయింది. ఇద్దరూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారట. దీంతో వాళ్లిద్దరూ విడిపోయారనే పుకార్లకు చెక్ పడింది.
Next Story