Telugu Global
Others

అంతరిక్షంలో కాఫీ ఇలా తాగుతారట..!

మనిషి భూమికి హత్తుకుని ఉండడానికి కారణం భూఆకర్షణ శక్తి. అదే లేకుంటే మనం గాల్లో తేలుతూ ఉండిపోయేవారం. అంటే అంతరిక్షంలోలాగా అన్నమాట. భూమి మీద కాఫీ తాగటం, ఇతర పనులు చేయడం చాలా ఈజీ. కానీ అంతరిక్షంలో అలా కాదు. అక్కడ భారరహిత స్థితిలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి పనీ చాలా రిస్క్‌తో కూడుకున్నదే. మరి అలాంటి చోట కాఫీ ఎలా తాగుతారో తెలుసా?. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల […]

అంతరిక్షంలో కాఫీ ఇలా తాగుతారట..!
X

మనిషి భూమికి హత్తుకుని ఉండడానికి కారణం భూఆకర్షణ శక్తి. అదే లేకుంటే మనం గాల్లో తేలుతూ ఉండిపోయేవారం. అంటే అంతరిక్షంలోలాగా అన్నమాట. భూమి మీద కాఫీ తాగటం, ఇతర పనులు చేయడం చాలా ఈజీ. కానీ అంతరిక్షంలో అలా కాదు. అక్కడ భారరహిత స్థితిలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి పనీ చాలా రిస్క్‌తో కూడుకున్నదే. మరి అలాంటి చోట కాఫీ ఎలా తాగుతారో తెలుసా?. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. అంతరిక్షంలోని వ్యోమనౌకలో కాఫీ తాగాలంటే తొలుత కాఫీ వెండర్ యంత్రలోంచి కాఫీ కోసం ఉంచిన ఒక కవర్‌ తీసుకోవాలి. అందులో చక్కెర, కాఫీ పౌడర్ కలిపి ఉంటుంది. మరోచోట కవర్ ఉంచి బటన్ నొక్కితే అందులోకి వేడి నీరు వస్తుంది. అంతే కాఫీ రెడీ. అయితే దాన్ని నేరుగా తాగడం మాత్రం సాధ్యం కాదు. ప్లాస్టిక్ స్ట్రా తప్పనిసరి. అంటే అంతరిక్షంలో కాఫీ తాగే ప్రొసెస్ చిన్నదే అన్న మాట. watch video…

First Published:  20 Jan 2016 12:53 AM GMT
Next Story