Telugu Global
Others

వైసీపీలో కృష్ణ సోదరుడికి ప్రమోషన్

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు వైసీపీలో ప్రమోషన్ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఆదిశేషగిరిరావుకు స్థానం కల్పించారు. పార్టీ అధినేత జగన్ పేరున ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆది శేషగిరిరావు అనంతరం వైసీపీలో చేరారు. ఆ మధ్య ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావును బరిలో దింపాలని కూడా ఓ దశలో వైసీపీ ఆలోచన చేసింది. ఆదిశేషగిరిరావు స్వస్థలం గుంటూరు జిల్లా బుర్రిపాలెం. […]

వైసీపీలో కృష్ణ సోదరుడికి ప్రమోషన్
X

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు వైసీపీలో ప్రమోషన్ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఆదిశేషగిరిరావుకు స్థానం కల్పించారు. పార్టీ అధినేత జగన్ పేరున ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆది శేషగిరిరావు అనంతరం వైసీపీలో చేరారు. ఆ మధ్య ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావును బరిలో దింపాలని కూడా ఓ దశలో వైసీపీ ఆలోచన చేసింది. ఆదిశేషగిరిరావు స్వస్థలం గుంటూరు జిల్లా బుర్రిపాలెం. ఇటీవల ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుకి చంద్రబాబు సోదరి కుమార్తె ప్రియాంకతో వివాహం జరిగింది. ఆ విధంగా ఆదిశేషగిరిరావు చంద్రబాబు కుటుంబంతోనూ బంధుత్వం ఉంది. ఇప్పుడు ఆదిశేషగిరిరావును వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలోకి తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది.

First Published:  20 Jan 2016 8:02 AM GMT
Next Story