Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి తర్వాత ఈ సినిమాల సంగతేంటి ?

సంక్రాంతి అయిపోయింది. మరి ఆ సందర్భంగా విడుదలైన 4 భారీ చిత్రాల పరిస్థితేంటి… వాటిలో మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిన సినిమాలేవి? ఇప్పటికీ రన్ అవుతున్న సినిమాలేంటి… ప్రస్తుతం వాటి పరిస్థితులపై ఓ లుక్కేద్దాం. సోగ్గాడే చిన్ని నాయనా – ఈ సినిమా సంక్రాంతి తర్వాత కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. వీకెండ్ కాని సోమవారం కూడా థియేటర్లలో జనం కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈవెనింగ్ షోస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. ఈ వీకెండ్ కు సినిమా […]

సంక్రాంతి తర్వాత ఈ సినిమాల సంగతేంటి ?
X
సంక్రాంతి అయిపోయింది. మరి ఆ సందర్భంగా విడుదలైన 4 భారీ చిత్రాల పరిస్థితేంటి… వాటిలో మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిన సినిమాలేవి? ఇప్పటికీ రన్ అవుతున్న సినిమాలేంటి… ప్రస్తుతం వాటి పరిస్థితులపై ఓ లుక్కేద్దాం.
సోగ్గాడే చిన్ని నాయనా – ఈ సినిమా సంక్రాంతి తర్వాత కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. వీకెండ్ కాని సోమవారం కూడా థియేటర్లలో జనం కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈవెనింగ్ షోస్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. ఈ వీకెండ్ కు సినిమా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఎక్స్ ప్రెస్ రాజా – స్లో పాయిజన్ లా దూసుకొస్తోంది ఎక్స్ ప్రెస్ రాజా. కామెడీ, అద్భుతమైన కథనమే ఈ సినిమాకు ప్రాణం. అందుకే జనాలు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి ఫ్లో తగ్గడంతో… మరిన్ని థియేటర్లను ఎక్స్ ప్రెస్ రాజాకు కేటాయిస్తున్నారు. కేవలం మౌత్ టాక్ తో జనాల్ని ఎట్రాక్ట్ చేస్తున్న ఏకైక సినిమా ఇది. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే 10కోట్లు రావడం విశేషం.
నాన్నకు ప్రేమతో –
మిక్స్ డ్ టాక్ తో విడుదలైన ఈ సినిమాకు… ఆ నెగెటివ్ ఎఫెక్ట్ పెద్దగా పడలేదు. సినిమా బాగాలేదంటూ కొందరు కామెంట్స్ చేసినప్పటికీ… మరికొందరు రివ్యూలు రాసినప్పటికీ…. సినిమా వసూళ్లు తగ్గినట్టు ఏ సెంటర్లో కనిపించలేదు. సంక్రాంతి ముగిసినప్పటికీ… ఎన్టీఆర్ సినిమా చూసేందుకు జనాలు క్యూ కడుతూనే ఉన్నారు.
డిక్టేటర్ – సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల్లో డిక్టేటర్ మాత్రమే ప్రస్తుతం డల్ గా నడుస్తోంది. విడుదలైన 3 రోజులు అద్భుతంగా ఆడిన ఈ సినిమాను… సంక్రాంతి మేనియా పూర్తయిన వెంటనే చాలా థియేటర్ల నుంచి తీసేశారు. మరీ ముఖ్యంగా నైజాంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. డిక్టేటర్ థియేటర్లలో చాలా వాటిని సోగ్గాడే, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు కేటాయిస్తున్నారు.
First Published:  18 Jan 2016 7:07 PM GMT
Next Story