Telugu Global
Cinema & Entertainment

కొట్టుకున్న ఫ్యాన్స్‌

ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అభిమాన సంఘాల మధ్య పచ్చగడ్డి వేస్త భగ్గుమనేది. ఇప్పుడా సీన్ బాలకృష్ణ-నాగార్జున అభిమానుల మధ్యకు షిఫ్ట్ అయింది. ఈ ఇద్దరు హీరోలకు కొన్ని రోజులుగా పడట్లేదనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నాగార్జున ప్రతిష్టాత్మకంగా భావించిన ఓ కార్యక్రమానికి, బాలయ్యను ఆహ్వానించకపోవడమే ఈ గొడవకు కారణం. అప్పట్నుంచి ఆ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని ఫిలింనగర్ టాక్. ఇప్పుడా గ్యాప్ ఏ స్థాయిలో పెరిగిందో తిరుపతిలో కనిపించింది. ఓ మల్టీప్లెక్సులో ఒకేచోట […]

కొట్టుకున్న ఫ్యాన్స్‌
X
ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అభిమాన సంఘాల మధ్య పచ్చగడ్డి వేస్త భగ్గుమనేది. ఇప్పుడా సీన్ బాలకృష్ణ-నాగార్జున అభిమానుల మధ్యకు షిఫ్ట్ అయింది. ఈ ఇద్దరు హీరోలకు కొన్ని రోజులుగా పడట్లేదనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నాగార్జున ప్రతిష్టాత్మకంగా భావించిన ఓ కార్యక్రమానికి, బాలయ్యను ఆహ్వానించకపోవడమే ఈ గొడవకు కారణం. అప్పట్నుంచి ఆ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని ఫిలింనగర్ టాక్. ఇప్పుడా గ్యాప్ ఏ స్థాయిలో పెరిగిందో తిరుపతిలో కనిపించింది. ఓ మల్టీప్లెక్సులో ఒకేచోట బాలయ్య డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు నినాదాలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో….. కొంతమంది బాలకృష్ణ అభిమానులు, మరికొంతమంది నాగ్ ఫ్యాన్స్ కొట్టుకోవడం ప్రారంభించారు. పోలీసులు సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో ఫ్యాన్స్ పరారయ్యారు.
First Published:  17 Jan 2016 7:04 PM GMT
Next Story