Telugu Global
Cinema & Entertainment

పురాతన కోటలో బాహుబలి షూటింగ్

బాహుబలి పార్ట్-2 విడుదలకావడానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. మరోవైపు మొదటి భాగం షూటింగ్ టైమ్ లోనే …. రెండో భాగానికి చెందిన కొంత పార్ట్ షూటింగ్ కూడా అయిపోయింది. తాజాగా బాహుబలి-2 షూటింగ్ స్టార్ట్ చేసి… రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అంత భారీ షెడ్యూల్ తర్వాత కూడా రాజమౌళి…. సినిమా యూనిట్ కు గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. వెంటనే లొకేషన్ షిఫ్ట్ అంటున్నాడు. అవును…జనవరి 19 నుంచి కేరళలో బాహుబలి-2కు […]

పురాతన కోటలో బాహుబలి షూటింగ్
X
బాహుబలి పార్ట్-2 విడుదలకావడానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. మరోవైపు మొదటి భాగం షూటింగ్ టైమ్ లోనే …. రెండో భాగానికి చెందిన కొంత పార్ట్ షూటింగ్ కూడా అయిపోయింది. తాజాగా బాహుబలి-2 షూటింగ్ స్టార్ట్ చేసి… రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. అంత భారీ షెడ్యూల్ తర్వాత కూడా రాజమౌళి…. సినిమా యూనిట్ కు గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు. వెంటనే లొకేషన్ షిఫ్ట్ అంటున్నాడు. అవును…జనవరి 19 నుంచి కేరళలో బాహుబలి-2కు సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభమౌతుంది. కేరళలోని అతి పురాతనమైన కన్నూర్ ఫోర్ట్‌ని రాజమౌళి ‘బాహుబలి’ సినిమా షూటింగ్‌‌కి వేదికగా మార్చారు. 15వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించిన ఈ కోటలో 10 రోజుల పాటు ‘బాహుబలి’ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం. కేరళలో షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి రామోజీ ఫిలింసిటీలోనే బాహుబలి-2 షూటింగ్ కంటిన్యూ చేస్తారు. తొలి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కొనసాగుతున్నప్పటికీ…. హాస్యనటుడు ఫృధ్వీని ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రభాస్‌తో పాటు పలువురు కీలక నటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.
First Published:  17 Jan 2016 7:03 PM GMT
Next Story