Telugu Global
Others

దివాలా అంచున ఎంపీ రాయపాటి?

నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వందల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు చేసిన ఆయన వాటిని చెల్లించలేక చేతులెత్తేసే స్థితికి చేరుకున్నారు. రెండు నెలల్లో రూ. 434 కోట్లు చెల్లించకుంటే ఆస్తులు వేలం వేస్తామని ఆంధ్రాబ్యాంకు పత్రిక ప్రకటన కూడా విడుదల చేసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి 1500 కోట్లు అప్పు చేసినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఈ రుణం తీసుకున్నారు. ఆంధ్రాబ్యాంకు […]

దివాలా అంచున ఎంపీ రాయపాటి?
X

నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వందల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు చేసిన ఆయన వాటిని చెల్లించలేక చేతులెత్తేసే స్థితికి చేరుకున్నారు. రెండు నెలల్లో రూ. 434 కోట్లు చెల్లించకుంటే ఆస్తులు వేలం వేస్తామని ఆంధ్రాబ్యాంకు పత్రిక ప్రకటన కూడా విడుదల చేసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి 1500 కోట్లు అప్పు చేసినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఈ రుణం తీసుకున్నారు. ఆంధ్రాబ్యాంకు నుంచి తీసుకున్న 434 కోట్లకు ఏపీ, తెలంగాణలోని 11 ఆస్తులను రాయపాటి కంపెనీ తాకట్టు పెట్టింది. వీటిలో గుంటూరు లక్ష్మీపురంలోని రాయపాటి సొంతిల్లు కూడా ఉంది. ఢిల్లీలోని ట్రాన్స్‌ట్రాయ్ ప్రధాన కార్యాలయం కూడా తాకట్టులో ఉంది. ప్రస్తుతం చేసిన అప్పులకు రాయపాటి వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. కంపెనీ దక్కించుకున్న పలు భారీ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ఖర్చు చేసేందుకు కూడా రాయపాటి దగ్గర సొమ్ము లేదని చెబుతున్నారు.

First Published:  16 Jan 2016 10:07 AM GMT
Next Story