Telugu Global
Others

ఆటో డ్రైవర్‌కు కాదు... నీ భార్యకు చెప్పు

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌పై మాటల దాడి కొనసాగుతూనే ఉంది. దేశంలో అసహనంపై అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఆ దెబ్బకు చివరకు అమీర్ అతిథిదేవోభవ యాడ్‌ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు తాజాగా అమీర్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విరుచుకుపడ్డారు. భారత్ గొప్పతనం ఆటో డ్రైవర్లకు చెప్పడం కాదని ముందు నీ భార్యకు చెప్పు అని సూచించారు. అతిథి దేవోభవ ప్రకటనలో అమీర్‌ఖాన్ ఆటోడ్రైవర్ నిజాయితీని పొగుడుతూ భారత్ గొప్పదనాన్ని వివరిస్తారు. సరిగ్గా […]

ఆటో డ్రైవర్‌కు కాదు... నీ భార్యకు చెప్పు
X

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌పై మాటల దాడి కొనసాగుతూనే ఉంది. దేశంలో అసహనంపై అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. ఆ దెబ్బకు చివరకు అమీర్ అతిథిదేవోభవ యాడ్‌ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు తాజాగా అమీర్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విరుచుకుపడ్డారు. భారత్ గొప్పతనం ఆటో డ్రైవర్లకు చెప్పడం కాదని ముందు నీ భార్యకు చెప్పు అని సూచించారు. అతిథి దేవోభవ ప్రకటనలో అమీర్‌ఖాన్ ఆటోడ్రైవర్ నిజాయితీని పొగుడుతూ భారత్ గొప్పదనాన్ని వివరిస్తారు. సరిగ్గా దీన్ని ఉదహరిస్తూనే రాం మాధవ్ అమీర్‌ఖాన్‌పై మాటలు ఎక్కుపెట్టారు. దేశ గొప్పతనాన్ని ఆటో డ్రైవర్లకు బోధించడం కాకుండా ముందు సొంత భార్యకు బోధించు అని సెటైర్లు వేశారు. అవార్డ్ వాపసీని కూడా రాం మాధవ్ తప్పు పట్టారు. అవార్డులు తిరిగి ఇవ్వాలనుకుంటున్నవారు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

First Published:  15 Jan 2016 9:10 AM GMT
Next Story